Share News

ఐపీఎల్ 2026: క్రికెట్ బోర్డుపై కేసు వేసిన ఆర్సీబీ స్టార్ ప్లేయర్

ABN , Publish Date - Apr 02 , 2026 | 05:17 PM

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ నువాన్ తుషారా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్ 2026లో ఆడేందుకు నిరభ్యంతర పత్రం మంజూరు చేయకపోవడంతో శ్రీలంక క్రికెట్ ఉన్నతాధికారులపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

ఐపీఎల్ 2026: క్రికెట్ బోర్డుపై కేసు వేసిన ఆర్సీబీ స్టార్ ప్లేయర్
Nuwan Thushara case

స్పోర్ట్స్ డెస్క్: డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర(RCB) జట్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ జట్టు స్టార్ పేసర్, శ్రీలంక ఆటగాడు నువాన్ తుషారా తన దేశ క్రికెట్ బోర్డుపై కోర్టులో కేసు వేసినట్లు సమాచారం. ఐపీఎల్ ఆడేందుకు తనకు నో ఆబ్జెక్షన్ సరిఫికేట్(ఎన్వోసీ) నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ నువాన్ తుషారా ఈ నిర్ణయం తీసుకున్నాడు. శ్రీలంకకు చెందిన ఓ మీడియా సంస్థ నివేదిక ప్రకారం..


నువాన్ తుషారా(Nuwan Thushara) ఐపీఎల్ 2026లో పాల్గొనేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డును అనుమతి కోరగా.. బోర్డు నిర్దేశించిన ఫిట్‌నెస్ ప్రమాణాలను అందుకోలేదనే కారణంతో అతడికి ఎన్వోసీని నిరాకరించింది. అయితే గతంలో ఇదే ఫిట్‌నెస్‌తో ఆడినప్పుడు నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చిన బోర్డు.. ఇప్పుడు నిరాకరించడం అన్యాయమని అతడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. బోర్డు నిర్ణయం వల్ల తాను ఆర్థికంగా, కెరీర్ పరంగా ఎంతో నష్టపోతున్నానని తుషారా వెల్లడించాడు.


తుషారా తన ఫిర్యాదులో శ్రీలంక క్రికెట్ అధ్యక్షుడు షమ్మీ సిల్వా, కార్యదర్శి బందుల దిస్సనాయకే, కోశాధికారి సుజీవ గొడాలియడ్డ, సీఈఓ ఆష్లే డి సిల్వాలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ కేసు విచారణను కోర్టు ఏప్రిల్ 9కి వాయిదా వేసింది. మరోవైపు శ్రీలంక క్రికెట్(Srilanka Cricket) బోర్డుతో తనకున్న సెంట్రల్ కాంట్రాక్టు మార్చి 31తో ముగిసిందని.. దానిని పునరుద్ధరించుకోవడానికి తనకు ఇష్టం లేదని నువాన్ తుషారా స్పష్టం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుని ఫ్రీలాన్స్ క్రికెటర్‌గా కొనసాగాలని నువాన్ తుషారా భావిస్తున్నాడు.


ఐపీఎల్‌లో నువాన్ తుషారా ప్రయాణం

2025 ఐపీఎల్ వేలంలో నువాన్ తుషారాను ఆర్సీబీ రూ.1.6 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిచిన జట్టులో నువాన్ తుషారా సభ్యుడిగా ఉన్నాడు. మలింగ తరహా బౌలింగ్ యాక్షన్‌తో అలరించే అతడికి ఆర్సీబీ ఫ్యాన్స్‌లో మంచి క్రేజ్ ఉంది. ఒకవేళ కోర్టు నుంచి తుషారాకు అనుకూలంగా తీర్పు రాకపోతే.. ఆయన ఈ సీజన్ మొత్తానికి దూరం కావాల్సి ఉంటుంది. మరోవైపు, ఆర్సీబీ తమ ప్రారంభ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)ను ఓడించి ఐపీ

ఎల్ 2026ను విజయవంతంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: సన్ రైజర్స్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైన కేకేఆర్!

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సౌతాఫ్రికా ప్లేయర్

Updated Date - Apr 02 , 2026 | 05:29 PM