సెమీస్‌కు నార్త్‌జోన్
ABN , Publish Date - Aug 27 , 2026 | 03:46 AM
నార్త్‌జోన్ జట్టు దులీప్ ట్రోఫీ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్స్‌లో వెస్ట్‌జోన్‌పై 52 పరుగుల తేడాతో గెలిచింది.
క్వార్టర్స్‌లో వెస్ట్‌పై గెలుపు.. దులీప్ ట్రోఫీ
బెంగళూరు: నార్త్‌జోన్ జట్టు దులీప్ ట్రోఫీ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్స్‌లో వెస్ట్‌జోన్‌పై 52 పరుగుల తేడాతో గెలిచింది. 287 పరుగుల లక్ష్య ఛేదనలో.. మ్యాచ్‌కు నాలుగో, ఆఖరి రోజైన బుధవారం ఓవర్‌నైట్ స్కోరు 220/7తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన వెస్ట్ 234 పరుగులకు ఆలౌటైంది. అబిద్ ముస్తాక్ 4, నిషాంత్ సింధు 2 వికెట్లు పడగొట్టారు. నార్త్‌జోన్ 251, 222 పరుగులు చేయగా.. తొలి ఇన్నింగ్స్‌లో వెస్ట్‌జోన్ 187 రన్స్‌కు ఆలౌటైంది. కాగా ఈ నెల 30 నుంచి బెంగళూరు వేదికగా జరిగే సెమీస్‌లో సెంట్రల్ జోన్‌తో ఈస్ట్‌జోన్, సౌత్‌జోన్‌తో నార్త్ జోన్ తలపడనున్నాయి.
ఇవి కూడా చదవండి:
2027 వన్డే ప్రపంచకప్.. జట్టులో చేరేందుకు సిద్ధంగా ఉన్నా: భువనేశ్వర్ కుమార్
హాకీ ప్రపంచ కప్: సెమీస్ రేసు నుంచి భారత్ ఔట్