ఐపీఎల్ 2026: టాస్ నెగ్గిన బెంగళూరు.. బ్యాటింగ్ ఎవరిదంటే?
ABN , Publish Date - May 07 , 2026 | 07:03 PM
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ(గురువారం)మరో కీలక పోరు జరగనుంది. మరికాసేపట్లో ఏకనా స్టేడియం వేదికగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ(గురువారం)మరో కీలక పోరు జరగనుంది. మరికాసేపట్లో ఏకనా స్టేడియం వేదికగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(LSG VS RCB) తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో లఖ్‌నవూ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌కు ఎల్ఎస్‌జీ కొన్ని మార్పులు చేసింది. జోష్ ఇంగ్లిస్, మోసిన్ ఖాన్, అవేశ్ ఖాన్‌లు మ్యాచ్‌కు దూరంగా ఉన్నారు. కొత్తగా అర్షిన్ కులకర్ణి, షాబాజ్ జట్టులోకి వచ్చారు. గాయాల కారణంగా ఇంగ్లిస్, మోసిన్ ఖాన్ జట్టుకు దూరమైనట్లు ఎల్ఎస్‌జీ కెప్టెన్ రిషబ్ పంత్ తెలిపాడు.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఎల్ఎస్‌జీ కొనసాగుతుండగా.. ఆర్సీబీ మూడో స్థానంలో ఉంది. ఇదే సీజన్‌లో ఇప్పటికే ఆర్సీబీ చేతిలో ఎల్ఎస్‌జీ ఓడింది. ఈ మ్యాచ్ గెలిచి ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. అలానే లఖ్‌నవూపై విజయం సాధించి.. తమ స్థానాన్ని మెరుగుపర్చుకోవాలనే కసితో ఆర్సీబీ ఉంది. గత మ్యాచ్‌లో ఎల్ఎస్‌జీపై 5 వికెట్ల తేడాతో బెంగళూరు విజయం సాధించింది.
తుది జట్లు:
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్:
మిచెల్ మార్ష్, అర్షిన్ కులకర్ణి, నికోలస్ పూరన్, ఎడెన్ మార్‌క్రమ్, రిషబ్ పంత్(వికెట్ కీపర్/ కెప్టెన్), అక్షత్ రఘువంశీ, హిమ్మత్ సింగ్, షహబాజ్ అహ్మద్, దిగ్వేశ్ సింగ్ రాఠీ, మహ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్లు : మయాంక్ యాదవ్, ముకుల్ చౌదరి, అబ్దుల్ సమద్, మణమారన్ సిద్ధార్థ్, అవేశ్ ఖాన్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
జాకబ్ బెతెల్, విరాట్ కోహ్లి, దేవ్‌దత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేశ్ శర్మ(వికెట్ కీపర్), కృనాల్ పాండ్య, రొమారియో షెఫర్డ్, భువనేశ్వర్ కుమార్, సుయాశ్ శర్మ, రసిఖ్ సలామ్ దార్, జోష్ హేజిల్‌వుడ్
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్లు: జోర్డాన్ కాక్స్, టిమ్ డేవిడ్, మంగేశ్ యాదవ్, విక్కీ ఓత్సవాల్, వెంకటేశ్ అయ్యర్
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ ఫైనల్ వేదిక మార్పుపై స్పందించిన కర్ణాటక హోం మంత్రి
బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కీలక పదవికి రాజీనామా