Share News

ఇషాన్ కిషన్ అరుదైన ఘనత

ABN , Publish Date - Nov 01 , 2026 | 03:21 PM

న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదో టీ20లో వన్‌డౌన్‌లో వచ్చిన భారత బ్యాటర్ ఇషాన్ కిషన్ మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. నాలుగో టీ20లో డకౌట్ అయిన ఇషాన్.. ఇవాళ జరుగుతున్న ఆఖరి మ్యాచ్‌లో మాత్రం దుమ్మురేపాడు.

ఇషాన్ కిషన్ అరుదైన ఘనత

స్పోర్ట్స్ డెస్క్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదో టీ20లో వన్‌డౌన్‌లో వచ్చిన భారత బ్యాటర్ ఇషాన్ కిషన్ మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. నాలుగో టీ20లో డకౌట్ అయిన ఇషాన్.. ఇవాళ జరుగుతున్న ఆఖరి మ్యాచ్‌లో మాత్రం దుమ్మురేపాడు. 28 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. ఈ క్రమంలోనే ఇషాన్ 2 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు.


ఈ క్రమంలోనే ఇషాన్ ఒక అరుదైన ఫీట్ సాధించాడు. టీమిండియా తరఫున అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 2వేల పరుగులు పూర్తి చేయడానికి తక్కువ బంతులు తీసుకున్న మూడో బ్యాటర్‌గా ఈ పాకెట్ డైనమట్ నిలిచాడు. ఇషాన్ 1345 బంతుల్లో 2వేల పరుగుల మార్క్ చేరుకున్నాడు. ఈ జాబితాలో అభిషేక్ శర్మ (1024 బంతులు) అగ్రస్థానంలో ఉండగా, సూర్యకుమార్ యాదవ్ (1164 బంతులు) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.


ఇదే సమయంలో ఇషాన్‌ మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో భారత్ తరఫున టీ20ఐ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఇషాన్ నిలిచాడు. గతంలో సూర్యకుమార్ యాదవ్ 2022 ఏడాదిలో 1164 పరుగులు సాధించాడు. తాజాగా సూర్య రికార్డును బ్రేక్ చేసిన ఇషాన్ ఈ ఏడాది క్యాలెండర్ ఇయర్‌లో 1220 పరుగులు సాధించాడు.


ఈ వార్తలూ చదవండి

ఇండియా కూటమి వర్సెస్ బీజేపీ.. ఢిల్లీలో పోటాపోటీగా ర్యాలీలు

ఇండియా కూటమి ర్యాలీలో పాల్గొనం: సీజేపీ

Updated Date - Nov 01 , 2026 | 04:04 PM