Share News

ఐపీఎల్ 2026: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లైవ్‌ అప్‌డేట్స్

ABN , First Publish Date - Mar 28 , 2026 | 06:55 PM

ఐపీఎల్ 2026: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లైవ్‌ అప్‌డేట్స్

ఐపీఎల్ 2026: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్  లైవ్‌ అప్‌డేట్స్
RCB-SRH

Live News & Updates

  • Mar 28, 2026 21:25 IST

    RCB Vs SRH: హైదరాబాద్ బ్యాటింగ్ పూర్తి.. ఆర్సీబీ టార్గెట్ 202

    • భువీ వేసిన ఆఖరి ఓవర్లో వచ్చిన పరుగులు 9

    • నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 201 పరుగుల చేసిన హైదరాబాద్

    • డఫీ, షెఫర్డ్‌లకు చెరో 3 వికెట్లు

    • హాఫ్ సెంచరీతో చెలరేగిన ఇషాన్ కిషన్(80)

    • ఆర్సీబీ విజయ లక్ష్యం 202 పరుగులు

  • Mar 28, 2026 21:21 IST

    RCB Vs SRH: తొమ్మిదో వికెట్ కోల్పోయిన హైదరాబాద్

    • షెఫర్డ్ వేసిన 19వ ఓవర్ ఆఖరి బంతికి అనికేత్ వర్మ(43*) ఔట్

    • ఈ ఓవర్లో రెండు సిక్సర్లు, ఫోర్ బాదిన అనికేత్

    • ఆఖరి బంతికి విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చిన అనికేత్

    • 19 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్ 192/9

  • Mar 28, 2026 21:12 IST

    RCB Vs SRH: హర్షల్ పటేల్(0) ఔట్

    • భువనేశ్వర్ కుమార్ వేసిన 17.5వ బంతికి హర్షల్ పటేల్(0) ఔట్

    • దేవదత్ పడిక్కల్‌కు క్యాచ్ ఇచ్చిన హర్షల్

    • అంతకు ముందు అనికేత్ వర్మ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను వదిలేసిన విరాట్ కోహ్లీ

    • క్రీజులో అనికేత్ వర్మ(27*), డేవిడ్ పేన్(0*)

    • 18 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్ 175/8

  • Mar 28, 2026 21:06 IST

    RCB Vs SRH: హైదరాబాద్ ఏడో వికెట్ డౌన్

    • షెఫర్డ్ వేసిన 17వ ఓవర్ ఆఖరి బంతికి హర్ష్ దూబే(3) ఔట్

    • బౌండరీ లైన్ వద్ద దేవదత్ పడిక్కల్ క్యాచ్ ఇచ్చిన హర్ష్

    • 167 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయిన హైదరాబాద్

    • క్రీజులోకి హర్షల్ పటేల్

    • మరో ఎండ్‌లో అనికేత్ వర్మ(20*)

  • Mar 28, 2026 21:00 IST

    RCB Vs SRH: ఇషాన్ కిషన్(80) ఔట్

    • అభినందన్ సింగ్‌ వేసిన 15.6వ బంతికి ఇషాన్ కిషన్ ఔట్

    • బౌండరీ లైన్ వద్ద పక్షిలా క్యాచ్ పట్టిన ఫిల్ సాల్ట్

    • తృటిలో సెంచరీ మిస్ చేసుకున్న ఇషాన్

    • 155 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన హైదరాబాద్

  • Mar 28, 2026 20:50 IST

    RCB Vs SRH: సలీల్ అరోరా(9) ఔట్

    • సుయాశ్ శర్మ వేసిన 14.3వ బంతికి సలీల్(9) ఔట్

    • దేవదత్ పడిక్కల్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన సలీల్

    • 137 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన హైదరాబాద్

    • క్రీజులోకి అనికేత్ వర్మ

  • Mar 28, 2026 20:40 IST

    RCB Vs SRH: ఎట్టకేలకు.. ఎస్ఆర్‌హెచ్ నాలుగో వికెట్ డౌన్

    • రొమారియో షెఫర్డ్‌ వేసిన 14వ ఓవర్ తొలి బంతికే క్లాసెన్(31) ఔట్

    • ఫిల్ సాల్ట్‌కు బౌండరీ లైన్ వద్ద క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన క్లాసెన్

    • 97 పరుగుల భాగస్వామ్యానికి తెర

    • క్రీజులోకి సలీల్ అరోరా

    • ప్రస్తుతం హైదరాబాద్ స్కోర్ 126/4

  • Mar 28, 2026 20:39 IST

    RCB Vs SRH: ఇషాన్ విధ్వంసం

    • కృనాల్ పాండ్య వేసిన 13వ ఓవర్లో వచ్చిన పరుగులు 21

    • ఆఖరి రెండు బంతులకు భారీ సిక్సర్లు బాదిన ఇషాన్ కిషన్(72*)

    • ఈ ఓవర్ తొలి బంతికి క్లాసెన్(31*) సిక్సర్

    • 13 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్ 126/3

  • Mar 28, 2026 20:33 IST

    RCB Vs SRH: ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ

    • ఫోర్ బాది హాఫ్ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్

    • 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఇషాన్(51*)

    • టీ20ల్లో వరుసగా మూడో సారి ఇషాన్ అర్ధ శతకం

  • Mar 28, 2026 20:30 IST

    RCB Vs SRH: కట్టుదిట్టమైన బౌలింగ్

    • కృనాల్ పాండ్య వేసిన 11వ ఓవర్లో వచ్చిన పరుగులు 5

    • క్రీజులో ఇషాన్ కిషన్(47*), క్లాసెన్(22*)

    • 11 ఓవర్లకు ఎస్ఆర్‌హెచ్ స్కోర్ 92/3

  • Mar 28, 2026 20:28 IST

    RCB Vs SRH: హాఫ్ సెంచరీ దిశగా ఇషాన్ కిషన్

    • సుయాశ్ శర్మ వేసిన పదో ఓవర్లో వచ్చిన పరుగులు 8

    • రెండో బంతికి బౌండరీ బాదిన ఇషాన్ కిషన్(45*)

    • మరో ఎండ్‌లో క్లాసెన్(19*)

    • 10 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్ 87/3

  • Mar 28, 2026 20:22 IST

    RCB Vs SRH: నిలకడగా ఆడుతున్న బ్యాటర్లు

    • అభినందన్ సింగ్ వేసిన 9వ ఓవర్లో వచ్చిన పరుగులు 9

    • నాలుగో బంతిని బౌండరీకి పంపిన ఇషాన్ కిషన్(38*)

    • మరో ఎండ్‌లో క్లాసెన్(18*)

    • 28 బంతుల్లోనే 50 పరుగుల భాగస్వామ్యం

    • 9 ఓవర్లకు ఎస్ఆర్‌హెచ్ స్కోర్ 79/3

  • Mar 28, 2026 20:16 IST

    RCB Vs SRH: దూకుడు పెంచిన బ్యాటర్లు

    • 8వ ఓవర్ వేసిన రొమారియో షెఫర్డ్

    • ఈ ఓవర్లో వచ్చిన పరుగులు 16

    • రెండు ఫోర్లు బాదిన క్లాసెన్(17*)

    • బౌండరీ బాదిన ఇషాన్ కిషన్(30*)

    • 8 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్ 70/3

  • Mar 28, 2026 20:11 IST

    RCB Vs SRH: కట్టుదిట్టంగా బౌలింగ్ వేసిన డఫీ

    • డఫీ వేసిన ఏడో ఓవర్లో వచ్చిన పరుగులు 5

    • క్రీజులో ఇషాన్ కిషన్(25*), క్లాసెన్(6*)

    • 7 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్ 54/3

  • Mar 28, 2026 20:07 IST

    RCB Vs SRH: ఇషాన్ కిషన్ దూకుడు

    • అభినందన్ సింగ్ వేసిన ఆరో ఓవర్లో వచ్చిన పరుగులు 16

    • రెండు సిక్సర్లు, ఫోర్ బాదిన ఇషాన్ కిషన్(23*)

    • మరో ఎండ్‌లో క్లాసెన్(3*)

    • పవర్ ప్లే పూర్తి.. ఎస్ఆర్‌హెచ్ స్కోర్ 49/3

  • Mar 28, 2026 19:57 IST

    RCB Vs SRH: డఫీ ఆన్ ఫైర్.. ఎస్ఆర్‌హెచ్ మూడో వికెట్ డౌన్

    • డఫీ వేసిన 4.2వ బంతికి నితీశ్ కుమార్ రెడ్డి(1*) ఔట్

    • మిడ్ వికెట్ మీదుగా అభినందన్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చిన నితీశ్

    • డఫీకి మూడో వికెట్

    • 29 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్

  • Mar 28, 2026 19:56 IST

    RCB Vs SRH: కట్టుదిట్టమైన బౌలింగ్

    • నాలుగో ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్

    • ఈ ఓవర్లో వచ్చిన పరుగులు 6

    • క్రీజులో ఇషాన్ కిషన్(6*), నితీశ్ కుమార్ రెడ్డి(1*)

    • 4 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్ 29/2

  • Mar 28, 2026 19:52 IST

    IPL 2026: ఎస్ఆర్‌హెచ్ రెండో వికెట్ డౌన్

    • ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన డఫీ

    • మూడో ఓవర్లో ఫోర్ బాది తర్వాతి బంతికే ఔటైన ట్రావిస్ హెడ్(11*)

    • లాంగాన్‌లో ఫిల్ సాల్ట్‌కి క్యాచ్ ఇచ్చిన హెడ్

    • 23 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన హైదరాబాద్

  • Mar 28, 2026 19:49 IST

    IPL 2026: ఎస్ఆర్‌హెచ్‌కు షాక్.. అభిషేక్ ఔట్

    • డఫీ వేసిన మూడో ఓవర్ తొలి బంతికి అభిషేక్ శర్మ(7*) ఔట్

    • జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన అభిషేక్

    • క్రీజులోకి కెప్టెన్ ఇషాన్ కిషన్

  • Mar 28, 2026 19:47 IST

    IPL 2026: తడబడిన భువీ..

    • రెండో ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్

    • ఈ ఓవర్లో రెండు వైడ్లు వేసిన భువీ

    • మొత్తంగా వచ్చిన పరుగులు 10

    • క్రీజులో అభిషేక్ శర్మ(7*), హెడ్(7*)

    • 2 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్ 17/0

  • Mar 28, 2026 19:39 IST

    IPL 2026: అభిషేక్ శర్మ సిక్సర్

    • డఫీ వేసిన తొలి ఓవర్లో వచ్చిన పరుగులు 7

    • నాలుగో బంతికి సిక్సర్ బాదిన అభిషేక్ శర్మ(6*)

    • మరో ఎండ్‌లో హెడ్(1*)

    • తొలి ఓవర్‌కు ఎస్ఆర్‌హెచ్ స్కోర్ 7/0

  • Mar 28, 2026 19:34 IST

    IPL 2026: హైదరాబాద్ బ్యాటింగ్ స్టార్ట్

    • చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ-ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్

    • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ

    • ఫస్ట్ బ్యాటింగ్ చేస్తోన్న ఎస్ఆర్‌హెచ్ జట్టు

    • క్రీజులోక వచ్చిన ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్

    • తొలి ఓవర్ వేస్తోన్న డఫీ

  • Mar 28, 2026 19:16 IST

    IPL 2026: ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్స్ ఎవరంటే..

    • దేవదత్ పడిక్కల్, జాకబ్ బెథెల్, రసిక్ సలామ్ దార్, కనిష్క్ చౌహాన్, వెంకటేశ్ అయ్యర్

  • Mar 28, 2026 19:15 IST

    IPL 2026: ఎస్ఆర్‌హెచ్ ఇంపాక్ట్ ప్లేయర్స్

    • శివంగ్ కుమార్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ పేన్, స్మరన్ రవిచంద్రన్, సాకిబ్ హుస్సేన్

  • Mar 28, 2026 19:11 IST

    IPL 2026: ఆర్సీబీ తుది జట్టు ఇదే

    • విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, రజత్ పాటీదార్(కెప్టెన్), జితేశ్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకబ్ డఫీ, సుయాశ్ శర్మ

  • Mar 28, 2026 19:06 IST

    IPL 2026: ఎస్ఆర్‌హెచ్ తుది జట్టు ఇదే

    • అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కెప్టెన్, వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ

  • Mar 28, 2026 19:02 IST

    ఐపీఎల్ 2026: టాస్ గెలిచిన ఆర్సీబీ

    • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ జట్టు

    • తొలుత బ్యాటింగ్ చేయనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్

  • Mar 28, 2026 18:55 IST

    మరికాసేపట్లో ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్

    • చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ-ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్

    • డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనున్న ఆర్సీబీ