Share News

బోణీ కొట్టిన స్మృతి సేన

ABN , Publish Date - Oct 17 , 2026 | 01:32 AM

స్మృతి మంధాన కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌ని విజయంతో ఆరంభించింది. జింబాబ్వేతో మూడు టీ20ల సిరీ్‌సలోని ఆరంభ మ్యాచ్‌లో గెలుపొంది భారత మహిళల జట్టు బోణీ చేసింది.

బోణీ కొట్టిన స్మృతి సేన
Deepti Sharma, Nandini

  • 4 వికెట్లతో భారత్‌ విజయం

  • ఆదుకున్న దీప్తి, నిక్కీ ప్రసాద్‌

  • జింబాబ్వేతో తొలి టీ20

రాయ్‌పూర్‌: స్మృతి మంధాన కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌ని విజయంతో ఆరంభించింది. జింబాబ్వేతో మూడు టీ20ల సిరీ్‌సలోని ఆరంభ మ్యాచ్‌లో గెలుపొంది భారత మహిళల జట్టు బోణీ చేసింది. బౌలర్ల ఆధిపత్యం సాగిన ఈ మ్యాచ్‌లో దీప్తి శర్మ (37 బంతుల్లో 8 ఫోర్లతో 49), అరంగేట్ర నిక్కీ ప్రసాద్‌ (35 బంతుల్లో 6 ఫోర్లతో 39 నాటౌట్‌) పట్టుదలగా ఆడారు. జింబాబ్వే బౌలర్ల ధాటికి 19/4 స్కోరుతో టాపార్డర్‌ కుప్పకూలిన వేళ భారత జట్టును ఈ జోడీ ఆదుకుంది. దీంతో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ 4 వికెట్లతో నెగ్గి 1-0తో ముందంజ వేసింది. ముందుగా జింబాబ్వే 20 ఓవర్లలో 5 వికెట్లకు 114 పరుగులు చేసింది. షర్నే మేయర్స్‌ (43 నాటౌట్‌), కెలిస్‌ ఎన్‌ధ్లోవు (42) మాత్రమే రాణించారు. నందనికి 2 వికెట్లు లభించాయి. ఛేదనలో భారత్‌ 15.4 ఓవర్లలో 6 వికెట్లకు 116 పరుగులు చేసి గెలిచింది. గ్వాంజురకు మూడువికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా దీప్తి నిలిచింది.


దీప్తి, నిక్కీ గట్టెక్కించారు: స్వల్ప లక్ష్యమే అయినా భారత స్టార్‌ బ్యాటర్లను జింబాబ్వే బౌలర్లు వణికించారు. తొలి 19 బంతుల్లోనే కెప్టెన్‌ మంధాన (9), అనుష్క (4), హర్మన్‌ (1), షఫాలీ (4) పెవిలియన్‌కు చేరారు. ఇందులో ముగ్గురిని పేసర్‌ గ్వాంజుర అవుట్‌ చేయడం గమనార్హం. అయితే 20 రన్స్‌లోపే 4 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడిన జట్టును వెటరన్‌ దీప్తి శర్మ, నిక్కీ ఆదుకున్నారు. కాగా, విజయానికి 13 రన్స్‌ దూరంలో దీప్తి వెనుదిరిగినా, అప్పటికే నిక్కీతో కలిసి ఐదో వికెట్‌కు 82 రన్స్‌ జోడించింది. అజేయంగా నిలిచిన నిక్కీ ఓ ఫోర్‌తో 26 బంతులుండగానే మ్యాచ్‌ను ముగించింది.


దెబ్బతీసిన బౌలర్లు: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే ఇన్నింగ్స్‌లో ఎన్‌ధ్లోవు, మేయర్స్‌ మినహా మరెవరూ నిలదొక్కుకోలేదు. భారత బౌలర్లు 67 డాట్‌ బాల్స్‌ వేయడం విశేషం. తొలి ఓవర్‌లోనే బిజా డకౌట్‌ అయినా, ఎన్‌ధ్లోవు ధాటిగా ఆడింది. దీంతో తొలి పది ఓవర్లలో 60/1 స్కోరుతో ఫర్వాలేదనిపించింది. ఆ తర్వాత 11వ ఓవర్‌లో ముపచిక్వను శ్రీచరణి అవుట్‌ చేసింది. అనంతరం కుదురుకున్న ఎన్‌ధ్లోవును అరుంధతి దెబ్బతీసింది. చివరి ఓవర్‌లో నందని రెండు వికెట్లు తీయడంతో ప్రత్యర్థి 120 రన్స్‌లోపే పరిమితమైంది.


స్కోరుబోర్డు

జింబాబ్వే: ఎన్‌ధ్లోవు (బి) అరుంధతి 42, బిజా (ఎల్బీ) క్రాంతి 0, ముపచిక్వ (సి అండ్‌ బి) శ్రీచరణి 16, మేయర్స్‌ (నాటౌట్‌) 43, గ్వాంజుర (స్టంప్‌) రిచా (బి) నందని 9, మవుంగ (స్టంప్‌) రిచా (బి) నందని 0, టిరిపానో (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 20 ఓవర్లలో 114/5. వికెట్ల పతనం: 1-7, 2-60, 3-82, 4-113, 5-113. బౌలింగ్‌: క్రాంతి 2-0-16-1, నందని 4-0-11-2, షఫాలీ 3-0-20-0, దీప్తి 4-0-22-0, అరుంధతి 3-0-30-1, శ్రీచరణి 4-0-14-1.


భారత్‌: మంధాన (సి) మకుష (బి) గ్వాంజుర 9, షఫాలీ (సి అండ్‌ బి) గ్వాంజుర 4, అనుష్క (సి) ఎన్‌ధ్లోవు (బి) గ్వాంజుర 4, హర్మన్‌ (సి) గ్వాంజుర (బి) మవుంగ 1, నిక్కీ (నాటౌట్‌) 39, దీప్తి (సి) మేయర్స్‌ (బి) చారే 49, రిచా (సి) గ్వాంజుర (బి) బిజా 7, అరుంధతి (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు: 1; మొత్తం: 15.4 ఓవర్లలో 116/6. వికెట్ల పతనం: 1-14, 2-18, 3-19, 4-19, 5-101, 6-110; బౌలింగ్‌: మకుష 1.4-0-19-0, గ్వాంజుర 3-0-18-3, మవుంగ 3-1-19-1, చిపరె 1-0-10-0, చారె 3-0-23-1, బిజా 4-0-27-1.


ఇవి కూడా చదవండి:

జింబాబ్వేతో తొలి టీ20: కెప్టెన్‌గా స్మృతి.. టాస్ నెగ్గిన భారత్

వైభవ్ ఆడితే చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా: టీమిండియా మాజీ కోచ్

Updated Date - Oct 17 , 2026 | 01:54 AM