ఫేవరెట్ భారత్
ABN , Publish Date - Sep 18 , 2026 | 01:59 AM
ఆసియా క్రీడల మహిళల క్రికెట్ క్వార్టర్స్‌లో భారత్ శుక్రవారం జపాన్‌తో పోటీ పడనుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు బలమైన బౌలింగ్‌తో ముందుకు సాగుతోంది.
జపాన్‌తో నేడు క్వార్టర్స్ పోరు..
ఉ. 10.30 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో..
ఆసియాడ్ మహిళల క్రికెట్
నగోయా (జపాన్): రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి మహిళల ఆసియాకప్ గెలిచిన జోష్ మీదున్న భారత్.. ఆసియా క్రీడల్లోనూ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. శుక్రవారం జరిగే క్వార్టర్స్‌లో పసికూన జపాన్‌తో డిఫెండింగ్ చాంప్ భారత్ తలపడనుంది. 8 జట్లు పాల్గొంటున్న నాకౌట్ ఫార్మాట్ కావడంతో.. ప్రతి మ్యాచ్ కీలకమే. భారత బ్యాటింగ్‌లో డెప్త్ కనిపిస్తున్నా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, రిచా ఘోష్ తమ బ్యాట్లకు పని చెప్పాల్సిన అవసరం ఉంది. పేసర్లు రేణుక ఠాకూర్, క్రాంతి గౌడ్, నందని శర్మతో స్పిన్నర్లు దీప్తి శర్మ, శ్రీచరణితోపాటు గాయం నుంచి కోలుకొన్న శ్రేయాంక పాటిల్ జట్టులోకి రావడంతో బౌలింగ్ బలంగా కనిపిస్తోంది. కాగా, ఎంతో బలమైన ప్రత్యర్థిని ఎదుర్కోవడంలో కెప్టెన్ మై యనగిడా జట్టును ఎలా నడిపిస్తుందో చూడాలి.
ఆడకుండానే బంగ్లా..:
బంగ్లాదేశ్, పాకిస్థాన్ మహిళల జట్లు ఆసియాడ్ సెమీ్‌సకు చేరుకొన్నాయి. వర్షం కారణంగా మైదానం చిత్తడిగా మారడంతో.. బంగ్లా, చైనా మధ్య జరగాల్సిన తొలి క్వార్టర్స్ మ్యాచ్ టాస్ కూడా పడకుండా రద్దయింది. అయితే, మెరుగైన ర్యాంక్ ఆధారంగా బంగ్లా ముందంజ వేసింది. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో బంగ్లా 10వ స్థానంలో, చైనా 36వ ర్యాంక్‌లో ఉన్నాయి.
పాక్ కష్టంగా...: మరో క్వార్టర్స్‌లో పాక్ మూడు వికెట్ల తేడాతో థాయ్‌లాండ్‌పై కష్టపడి నెగ్గింది. వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో.. తొలుత థాయ్‌లాండ్ 91/4 స్కోరు చేసింది. ఛేదనలో పాక్ 10.4 ఓవర్లలో 92/7 స్కోరు చేసి గెలిచింది. ష్వాల్ జుల్ఫికర్ (25), ఫాతిమా (21) రాణించారు.
ఈ వార్తలనూ చదవండి:
అజిత్ అగార్కర్‌కు పొడిగింపు లేనట్టేనా.. రేసులో పార్ధివ్ పటేల్, ప్రజ్ఞాన్ ఓజా