అస్సలు ఊహించలేదు
ABN , Publish Date - Sep 05 , 2026 | 01:26 AM
మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా లెజెండరీ బ్యాటర్ మిథాలీ రాజ్ రికార్డును అధిగమిస్తానని అస్సలు ఊహించలేదని టీమిండియా స్టార్ స్మృతి మంధాన వ్యాఖ్యానించింది.
మిథాలీ రికార్డు ఛేదనపై మంధాన
న్యూఢిల్లీ: మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా లెజెండరీ బ్యాటర్ మిథాలీ రాజ్ రికార్డును అధిగమిస్తానని అస్సలు ఊహించలేదని టీమిండియా స్టార్ స్మృతి మంధాన వ్యాఖ్యానించింది. ఆసియా కప్‌లో హాంకాంగ్‌పై మ్యాచ్‌లో శతకం చేసిన మంధాన.. ఆ ఇన్నింగ్స్‌తో అత్యధిక పరుగుల మిథాలీ రికార్డుతో పాటు, అత్యధిక సెంచరీల జాబితాలో మెక్ లానింగ్, లారా వోల్వార్ట్‌లను దాటేసింది. ఈ ఘనతలపై స్పందిస్తూ.. ‘మిథాలీ లెజెండ్. మాకు రోల్‌మోడల్. ఆమె బ్యాటింగ్ చూస్తూ పెరిగాం. ఆమె రికార్డును దాటేస్తానని కలలో కూడా ఊహించలేదు’ అని పేర్కొంది.
ఈ వార్తలను కూడా చదవండి
ఈ ఏడాది తొలి విజయం.. జీఎస్ఎల్‌వీ-ఎఫ్17 మిషన్: ఇస్రో చైర్మన్ నారాయణన్