Share News

వీడియో: స్పీడ్ బ్రేకర్ దాటేందుకు ఇబ్బంది పడిన పాండ్య ఫెరారీ కారు..

ABN , Publish Date - Mar 29 , 2026 | 03:22 PM

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్, ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్య ఇటీవల రూ.12 కోట్ల విలువ ఫెరారీ కారును కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తరచూ ముంబై వీధుల్లో దాన్ని నడుపుతూ పాండ్య కనిపిస్తుంటాడు. తాజాగా...

వీడియో: స్పీడ్ బ్రేకర్ దాటేందుకు ఇబ్బంది పడిన పాండ్య ఫెరారీ కారు..
Hardik Pandya Ferrari

స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్, ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్య ఇటీవల రూ.12 కోట్ల విలువైన ఫెరారీ కారును కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తరచూ ముంబై వీధుల్లో దాన్ని నడుపుతూ పాండ్య కనిపిస్తుంటాడు. ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ(ఆదివారం) కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో తమ తొలి మ్యాచ్‌కు ముంబై ఇండియన్స్ సిద్ధమవుతున్న తరుణంలో ముంబైలో హార్దిక్ ఈ లగ్జరీ కారును నడుపుతున్న మరో వీడియో తాజాగా బయటపడింది. అయితే, ఇలాంటి ఖరీదైన స్పోర్ట్స్ కార్ల విషయంలో తరచుగా జరిగే విధంగానే పాండ్య కారుకు జరిగింది. కారు గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువగా ఉండటం వల్ల ముంబై రోడ్లపై ఉన్న స్పీడ్ బ్రేకర్‌ను దాటడం హార్దిక్‌కు కష్టమైంది.


సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో హార్దిక్ స్పీడ్ బ్రేకర్‌ను దాటడానికి ప్రత్యేకమైన పద్ధతిని ఉపయోగించడం చూడవచ్చు. స్పీడ్ బ్రేకర్ పై నుంచి నుంచి వెళ్లకుండా, అలానే కారుకు ఎలాంటి డ్యామేజ్ జరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాడు. కారును స్పీడ్ బ్రేకర్‌పై నుంచి నేరుగా వెళ్లనివ్వకుండా.. క్రాస్‌గా దాటించాడు. దీంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా కారు ముందుకు వెళ్లింది. స్పీడ్ బ్రేకర్‌ను విజయవంతంగా దాటించిన తర్వాత కొందరు పోలీసు అధికారులతో మాట్లాడటానికి హార్దిక్ ఆగాడు. ముంబై వీధుల్లో అరుదుగా కనిపించే విలాసవంతమైన కారును ఈ స్టార్ క్రికెటర్ నడపడం చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పటిష్టమైన ముంబై ఇండియన్స్ జట్టు, ఆరో టైటిల్ అందుకునే వేటలో ఆదివారం తన తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. ఇప్పటి వరకు ముంబై ఐదు ఐపీఎల్ టైటిల్స్‌ను అందుకుంది. గత సీజన్ లో హార్దిక్ పాండ్య నేతృత్వంలోని ముంబై జట్టు క్వాలిఫయర్ 2లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడిపోయి మూడో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే ఆరో టైటిల్ కోసం ఇతర జట్లకు గట్టి పోటీ ఇవ్వడానికి తమకు అన్ని విధాలా పటిష్ఠంగా ఉందని ముంబై ఇండియన్స్ భావిస్తోంది.


ఇవి కూడా చదవండి:

నేడు ముంబైతో మ్యాచ్.. భయంలో కేకేఆర్!

నితీశ్ కుమార్ రెడ్డిపై ధోనీ ఫ్యాన్స్ సెటైర్లు! ఎందుకంటే..

Updated Date - Mar 29 , 2026 | 06:04 PM