Share News

లంక బౌలర్లపై విరుచుకుపడ్డ భారత పేసర్ గుర్నూర్!

ABN , Publish Date - Aug 08 , 2026 | 08:05 PM

శ్రీలంక ఎలెవన్‌తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా పేసర్ గుర్నూర్ బ్రార్ సునామీ బ్యాటింగ్ ఆడాడు. లంక బౌలర్‌ దిలుమ్ సుదీరకు చుక్కలు చూపించాడు.

లంక బౌలర్లపై విరుచుకుపడ్డ భారత పేసర్ గుర్నూర్!
Gurnoor Brar

స్పోర్ట్స్ డెస్క్: శ్రీలంక ఎలెవన్‌తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా పేసర్ గుర్నూర్ బ్రార్ అద్భుత బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. ప్రధానంగా బౌలరైన గుర్నూర్.. రెండో రోజు ఆట ముగిసే సమయంలో బ్యాటింగ్‌తో సిక్సర్ల తుఫాన్ సృష్టించాడు.


రెండో రోజు చివరి ఓవర్‌లో శ్రీలంక స్పిన్నర్ దిలుమ్ సుదీర బౌలింగ్‌కు రాగా.. తొలి బంతికి దేవదత్ పడిక్కల్ సింగిల్ తీసి గుర్నూర్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. ఆ తర్వాత సుదీర వేసిన వరుస బంతుల్లో గుర్నూర్ రెండు భారీ సిక్సర్లు బాదాడు. తర్వాతి బంతికి పడిక్కల్ సింగిల్ తీసే అవకాశం ఉన్నా, తనపై నమ్మకంతో గుర్నూర్ దాన్ని తిరస్కరించాడు.


ఆ తర్వాత మిగిలిన రెండు బంతులను కూడా సిక్సర్లుగా మలచి ఆ ఓవర్‌ను ఘనంగా ముగించాడు. ఈ విధంగా ఒకే ఓవర్లో ఐదు బంతుల్లోనే 4 సిక్సర్లు బాది లంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 18 బంతుల్లోనే 36 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన గుర్నూర్ బ్రార్, జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఆరు వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. శ్రీలంక క్రికెట్ ఎలెవన్ 363/8 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.


ఇవి కూడా చదవండి:

నాలుగు నెలలుగా సెలవు ఇవ్వకుండా వేధించారు.. ఆత్మహత్య లేఖలో ఉద్యోగిని ఆవేదన..

'ది హండ్రెడ్' టోర్నీ నుంచి జెమీమా ఔట్!

Updated Date - Aug 08 , 2026 | 08:50 PM