Share News

రాణించిన వైభవ్, ఇషాన్.. దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు ఈస్ట్ జోన్

ABN , Publish Date - Sep 01 , 2026 | 07:42 PM

దులీప్ ట్రోఫీ 2026 సీజ‌న్‌లో ఈస్ట్ జోన్ జ‌ట్టు ఫైన‌ల్లో అడుగుపెట్టింది. సెమీఫైన‌ల్లో ఈస్ట్‌జోన్ 4 వికెట్ల తేడాతో సెంట్ర‌ల్ జోన్‌పై విజ‌యం సాధించింది.

రాణించిన వైభవ్, ఇషాన్.. దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు ఈస్ట్ జోన్
Duleep Trophy 2026

స్పోర్ట్స్ డెస్క్: దులీప్ ట్రోఫీ (Duleep Trophy2026) ఫైనల్‌కు ఈస్ట్ జోన్ జట్టు దూసుకెళ్లింది. తొలి సెమీ ఫైనల్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో సెంట్రల్ జోన్‌పై ఈస్ట్ జోన్ వికెట్ల తేడాతో విజయం సాధించింది. 159 పరుగుల టార్గెట్‌ని ఇషాన్ కిషన్ జట్టు 39.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (40), కెప్టెన్ ఇషాన్ కిషన్ (39) రాణించారు. అభిమన్యు ఈశ్వరన్ 24, కుమార్ కుశాగ్ర 22 పరుగులు చేశారు. షమి (8*) విన్నింగ్ షాట్ కొట్టాడు. సెంట్ర‌ల్ జోన్ బౌల‌ర్ల‌లో హ‌ర్ష్ దూబే 4 వికెట్లు తీయ‌గా, సారాంశ్ జైన్‌, య‌శ్ ఠాకూర్ చెరొక వికెట్ ప‌డ‌గొట్టారు.


అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌లో 45/3 స్కోరుతో ఇవాళ(మంగళవారం) ఆటను కొనసాగించిన సెంట్రల్ జోన్ 158 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ అమన్ మోఖడే (41) రాణించగా..అర్షద్ ఖాన్ (25), హర్ష్‌ దూబె (24), రింకు సింగ్ (20) పరుగులు చేశారు. ముకేశ్ కుమార్ 4, మహ్మద్ షమి 3 వికెట్లతో సత్తాచాటారు. అభిజిత్, అనుకుల్ రాయ్, కౌనైన్ ఖురేషీ ఒక్కో వికెట్ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇరుజట్లూ 266 పరుగులకు ఆలౌటయ్యాయి. సెప్టెంబరు 6 నుంచి చెపాక్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్‌ మొదలుకానుంది. నార్త్ జోన్, సౌత్ జోన్ మధ్య జరుగుతున్న రెండో సెమీ ఫైనల్‌లో విజేతగా నిలిచిన జట్టుతో ఈస్ట్ జోన్‌ ఫైనల్‌లో తలపడనుంది.


ఇవి కూడా చదవండి:

అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌.. భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించిన బీసీసీఐ

పాకిస్థాన్ క్రికెట్‌లో అలజడి.. సెలెక్షన్ కమిటీకి మిస్బా ఉల్ హక్ రాజీనామా!

Updated Date - Sep 01 , 2026 | 07:49 PM