Share News

ఐపీఎల్ 2026: ఆదుకున్న సూర్య కుమార్.. ముంబై స్కోర్ 162

ABN , Publish Date - Apr 04 , 2026 | 05:21 PM

ఐపీఎల్ 19వ సీజన్‌లో భాగంగా ఇవాళ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడిన ముంబై జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. సూర్యకుమార్ యాదవ్(51) అర్ధ సెంచరీతో రాణించడంతో ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది.

ఐపీఎల్ 2026: ఆదుకున్న సూర్య కుమార్.. ముంబై స్కోర్ 162
Delhi Target 163

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 19వ సీజన్‌లో భాగంగా ఇవాళ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడిన ముంబై జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. సూర్యకుమార్ యాదవ్(51) అర్ధ సెంచరీతో రాణించడంతో ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో ముంబై బ్యాటర్లు పరుగులు రాబట్టేందు ఇబ్బంది పడ్డారు.


ముంబై బ్యాటర్లలో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్(36 బంతుల్లో 51), రోహిత శర్మ(26 బంతుల్లో 35), తిలక్ వర్మ(21 బంతుల్లో 28) రాణించారు. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్(9) తక్కువ పరుగులకే ముఖేశ్ కుమార్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. మిచెల్ శాంట్నర్(13 బంతుల్లో 18) ఆశించిన మేర రాణించలేదు. చివర్లో కార్బిన్ బాష్(4 బంతుల్లో 11) బ్యాట్ ఝళిపించాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ముఖేశ్ రెండు వికెట్లు సాధించాడు. లొంగి ఎంగిడి, అక్షర్ పటేల్ , నిగమ్, టి నటరాజన్ తలో వికెట్ సాధించారు. మొత్తంగా ఢిల్లీ క్యాపిటల్స్ ముందు 163 పరుగుల లక్ష్యాన్ని ముంబై జట్టు నిర్దేశించింది.


ఇవి కూడా చదవండి:

ఆర్చర్‌పై విరుచుకుపడ్డ వైభవ్ సూర్యవంశీ

ఢిల్లీతో మ్యాచ్.. ముంబై ఇండియన్స్‌కి భారీ షాక్

Updated Date - Apr 04 , 2026 | 06:53 PM