ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ ఘన విజయం
ABN , Publish Date - Apr 04 , 2026 | 07:06 PM
ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. సమీర్ రిజ్వి(90) మెరుపు ఇన్నింగ్స్‌తో ముంబై ఇండియన్స్‌పై 6 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయం సాధించింది.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. సమీర్ రిజ్వి(90) మెరుపు ఇన్నింగ్స్‌తో ముంబై ఇండియన్స్‌పై వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి.. 162 పరుగులు చేసింది. అనంతరం రిజ్వి చెలరేగి ఆడటంతో ఢిల్లీ జట్టు 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
ఢిల్లీ బ్యాటర్లలో రిజ్వి(51 బంతుల్లో 90) ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అలానే పాథుమ్ నిశాంక(40) కూడా సమీర్ కు సహాకారం అందించాడు. డేవిడ్ మిల్లర్(21) ఫర్వాలేదనిపించాడు. మ్యాచ్ చివర్లో కాస్తా ఉత్కంఠ నెలకొన్నా.. చివరకు ఢిల్లీ విజయం సాధించింది. ముంబై బౌలర్లలో దీపక్ చాహార్, మిచెల్ శాంట్నర్, బాష తలో వికెట్ సాధించారు. అంతకు ముందు ముంబై బ్యాటర్లలో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్(36 బంతుల్లో 51), రోహిత శర్మ(26 బంతుల్లో 35), తిలక్ వర్మ(21 బంతుల్లో 28) రాణించారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ముఖేశ్ రెండు వికెట్లు సాధించాడు. లొంగి ఎంగిడి, అక్షర్ పటేల్ , నిగమ్, టి నటరాజన్ తలో వికెట్ సాధించారు.
ఇవి కూడా చదవండి: