Share News

పాకిస్థాన్ ఆటగాళ్లపై డేవిడ్ వార్నర్ ఫైర్.. వీడియో వైరల్

ABN , Publish Date - Mar 26 , 2026 | 09:44 PM

పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్ ఆటగాళ్లపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

పాకిస్థాన్ ఆటగాళ్లపై డేవిడ్ వార్నర్ ఫైర్.. వీడియో వైరల్
David Warner PSL 2026

స్పోర్ట్స్ డెస్క్: పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్ ఆటగాళ్లపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాకిస్థాన్ ప్రీమియం ఆటగాళ్లకు కనీస ఇంగిత జ్ఞానం లేదని, మీడియా సమావేశంలో ఎలా ఉండాలో కూడా తెలియదని అసహనం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్) 2026 సీజన్‌ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో కెప్టెన్ల రౌండ్ టేబుల్ మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో కరాచీ కింగ్స్‌కు సారథ్యం వహిస్తున్న డేవిడ్ వార్నర్.. తన జట్టు వ్యూహాల గురించి సీరియస్‌గా వివరిస్తున్నాడు. అదే సమయంలో పక్కనే కూర్చున్న ఇతర జట్ల కెప్టెన్లు షాహీన్ అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్ ఒకరిపై ఒకరు జోకులు పేల్చుకుంటూ నవ్వుకుంటున్నారు. వార్నర్ చెబుతున్న విషయాలను పట్టించుకోలేదు. దాంతో అతను తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.


'ఇలా అడుగుతున్నందుకు క్షమించండి. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది?. ఇక్కడ కొంతమంది స్కూల్ పిల్లల్లా ప్రవర్తిస్తున్నారు. వీళ్లు తమను తాము ప్రీమియం ఆటగాళ్లమని పిలుచుకుంటున్నారు. కానీ వీరి ప్రవర్తన మాత్రం చిన్న పిల్లల కంటే దారుణంగా ఉంది. ఒక మీడియా సమావేశంలో ఎలా ప్రవర్తించాలో కూడా వీరికి తెలియదా?' అని అసహనం వ్యక్తం చేశాడు. చాలా మంది నెటిజన్లు డేవిడ్ వార్నర్ ను సమర్థిస్తున్నారు. అంతర్జాతీయ ప్రెస్‌మీట్స్‌లో ప్రొఫెషనలిజం ఉండాల్సిందేనని ఆయన మద్దతు తెలుపుతున్నారు. వార్నర్ లాంటి సీనియర్ ప్లేయర్ మాట్లాడుతున్నప్పుడు తోటి ఆటగాళ్లు గౌరవం ఇవ్వకపోవడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.


ఇవి కూడా చదవండి:

ప్రీతి జింటా నాకు సారీ చెప్పింది: ఆర్సీబీ ప్లేయర్

PL 2026 : రెండో ద‌శ‌ షెడ్యూల్ వ‌చ్చేసింది..

Updated Date - Mar 26 , 2026 | 09:54 PM