భువనేశ్వర్ కుమార్ కెరీర్‌పై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..
ABN , Publish Date - Nov 03 , 2026 | 06:45 PM
టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ రీఎంట్రీ ఆశించిన స్థాయిలో జరగలేదు. ఐపీఎల్, దేశవాళీ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసి జాతీయ జట్టులోకి పునరాగమనం చేశాడు.
స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ రీఎంట్రీ ఆశించిన స్థాయిలో జరగలేదు. ఐపీఎల్, దేశవాళీ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసి జాతీయ జట్టులోకి పునరాగమనం చేశాడు. అందివచ్చిన అవకాశాన్ని భువీ సద్వినియోగం చేసుకోలేదు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. ఐదు మ్యాచుల్లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఈ సీనియర్ పేసర్ కేవలం ఒకే ఒక్క వికెట్ తీశాడు. ఈ నేపథ్యంలో భువనేశ్వర్ అంతర్జాతీయ కెరీర్‌పై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో భువీ ప్రదర్శన నిరాశపరిచిందని అశ్విన్ పేర్కొన్నాడు. భువనేశ్వర్‌కి మళ్లీ జాతీయ జట్టులో చోటు దక్కడం కష్టమేనని.. అతడు ఆఖరి మ్యాచ్ ఆడేసినట్లు భావిస్తున్నానని అశ్విన్ తెలిపాడు. ఐపీఎల్, దేశవాళీలో భువనేశ్వర్ బౌలింగ్‌కు, న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో అతడి ప్రదర్శనకు రాత్రి, పగలుకు ఉన్నంత తేడా ఉందన్నాడు. బౌలింగ్‌లో వేగం, రన్‌అప్ తీవ్రత తగ్గినట్లు కనిపించిందని అశ్విన్ పేర్కొన్నాడు. సరైన సన్నద్ధతతో ఈ సిరీస్‌కు వచ్చాడా? అనే అనుమానం వ్యక్తమవుతుందని ఈ సీనియర్ బౌలర్ తెలిపాడు.
అనుభవజ్ఞుడైన ఆటగాడు రీఎంట్రీలో ఇలా ఆడితే సెలక్టర్లు మరో అవకాశం ఇవ్వడం కష్టమని అభిప్రాయపడ్డాడు. జాతీయ జట్టులో భువీ కెరీర్ దాదాపు ముగిసినట్లేనని అశ్విన్ వ్యాఖ్యానించాడు. భువనేశ్వర్ జాతీయ జట్టులోకి రీఎంట్రీకి ముందు చివరగా నవంబర్ 2022లో అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన భువీ... 16 మ్యాచ్‌ల్లో 28 వికెట్లు పడగొట్టి టోర్నమెంట్‌లోని అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. మొత్తంగా పునరాగమనంతో జాతీయ జట్టులో తన స్థానం పదిలం చేసుకోవాలనుకున్న అతడి ఆశలకు గట్టి దెబ్బ తగిలిందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
పులివెందుల మున్సిపాలిటీ టీడీపీ కైవసం.. 13,875 ఓట్ల మెజారిటీతో భారీ గెలుపు
రూ.21,800 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ
ఢిల్లీ వ్యాపార సంఘాల పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు