పులివెందుల మున్సిపాలిటీ టీడీపీ కైవసం.. 13,875 ఓట్ల మెజారిటీతో భారీ గెలుపు
ABN , Publish Date - Nov 03 , 2026 | 05:55 PM
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి దూసుకుపోతోంది. వైసీపీపై ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ కూటమి అభ్యర్థులు విజయ ఢంకా మోగిస్తున్నారు. ఇప్పటికే అనేక మున్సిపాలిటీలను సొంతం చేసుకున్న టీడీపీ.. తాజాగా పులివెందుల మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్నీ కైవసం చేసుకుంది.
కడప జిల్లా: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి దూసుకుపోతోంది. వైసీపీపై ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ కూటమి అభ్యర్థులు విజయ ఢంకా మోగిస్తున్నారు. ఇప్పటికే అనేక మున్సిపాలిటీలను సొంతం చేసుకున్న టీడీపీ.. తాజాగా పులివెందుల మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్నీ దక్కించుకుంది. 13,875 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి గీతాకుమారి ఘన విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి వైఎస్ ప్రమీలను చిత్తు చేస్తూ ఆమె గెలుపొందారు.
మొత్తం 40 వార్డుల్లో 34 చోట్ల టీడీపీ, 2 చోట్ల బీజేపీ, 3 చోట్ల వైసీపీ, 1 చోట జనసేన అభ్యర్థులు గెలుపొందారు. కాగా, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరడం చర్చనీయాంశంగా మారింది. దీంతో కూటమి శ్రేణులు స్థానికంగా పెద్దఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు, కడప జిల్లాలో ఇప్పటికే బద్వేల్, రాజంపేట, రాయచోటి, మైదుకూరు మున్సిపాలిటీను టీడీపీ కైవసం చేసుకుంది. ఎర్రగుంట్ల మున్సిపాలిటీని బీజేపీ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని కూటమి పార్టీల్లో ఉత్సాహం నెలకొంది. ఆయా ప్రాంతాల్లో నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
జగన్ అడ్డా కడపలో టీడీపీ హవా.. నాలుగు మున్సిపాలిటీలు కైవసం
విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో సంచలనం.. టీడీపీ మేయర్ అభ్యర్థికి భారీ మెజారిటీ..