Share News

పాకిస్థాన్‌కు బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైన బంగ్లాదేశ్!

ABN , Publish Date - Mar 24 , 2026 | 05:43 PM

పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వెన్నుపోటు పొడిచేలా కనిపిస్తుంది. బంగ్లా మంత్రి చేసిన వ్యాఖ్యలు ఈ వార్తకు బలం చేకూరుస్తున్నాయి. భద్రతా కారణాలతో పాకిస్థాన్ సూపర్ లీగ్2026కి తమ ఆటగాళ్లను దూరంగా ఉంచాలనే యోచనలో బీసీబీ ఉన్నట్లు సమాచారం.

పాకిస్థాన్‌కు బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైన బంగ్లాదేశ్!
Bangladesh cricket board

స్పోర్ట్స్ డెస్క్: పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వెన్నుపోటు పొడిచేలా కనిపిస్తుంది. బంగ్లా మంత్రి చేసిన వ్యాఖ్యలు వార్తకు బలం చేకూరుస్తున్నాయి. భద్రతా కారణాలతో పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్ 2026) టోర్నీ‌కి తమ ఆటగాళ్లను దూరంగా ఉంచాలనే యోచనలో బీసీబీ ఉన్నట్లు సమాచారం. టీ20 ప్రపంచకప్ 2026 సమయంలో తమకు అండగా నిలిచిన పాక్‌కు బంగ్లాదేశ్ ఇలా దిమ్మతిరిగే షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది.


పీఎస్‌ఎల్ 2026 సీజన్‌‌లో పాల్గొనేందుకు బంగ్లాదేశ్‌కు చెందిన ముస్తాఫిజుర్ రెహ్మాన్, పర్వేజ్ హోస్సైన్, షోరిఫుల్ ఇస్లాం, నహిద్ రాణా, తంజిద్ హసన్ తమీమ్, రిషాద్ హోస్సైన్‌కు బీసీబీ నిరభ్యంతర పత్రాలను(ఎన్‌ఓసీ) మంజూరు చేసింది. కానీ అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ మధ్య జరుగుతున్న యుద్ధంతో ప్రస్తుతం నెలకొన్న అస్థిర పరిస్థితుల కారణంగా బంగ్లా ప్రభుత్వం తమ ఆటగాళ్లను పంపేందుకు సంకోచిస్తోంది. 'మా ఆటగాళ్ల భద్రత విషయంలో చిన్నపాటి సందేహం ఉన్నా.. వారిని పాకిస్థాన్‌కు పంపబోము. దీనిపై ముందుగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పూర్తి విశ్లేషణ చేసి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత జాతీయ భద్రతా సంస్థల సలహా మేరకు ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది’ అని బంగ్లాదేశ్ క్రీడా శాఖ మంత్రి అమినూల్ హక్ స్పష్టం చేశారు.


పశ్చిమాసియా యుద్ధం కారణంగా పాక్ లో ఇంధన కొరత ఏర్పడింది. దీంతో ఇంధన, భద్రతా కారణాలతో పీఎస్‌ఎల్ 2026ను ప్రేక్షకుల్లేకుండా కేవలం కరాచీ, లాహోర్ మైదానాల్లోనే నిర్వహిస్తామని పీసీబీ ప్రకటించింది. లీగ్ మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించమని స్పష్టం చేసింది. ఈ ప్రకటనతో పీఎస్‌ఎల్ ఆడేందుకు విదేశీ ఆటగాళ్లు సంకోచిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన పొట్టి ప్రపంచ కప్ సమయంలో బంగ్లాదేశ్‌కు అండగా నిలిచిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఇప్పుడు ఆ దేశ క్రికెట్ బోర్డు మొండి చెయ్యి చూపించేందుకు సిద్దమైంది. దాంతో పీసీబీపై పాకిస్థాన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మే26 నుంచి పీఎస్ఎల్ ప్రారంభం కానుంది. మరి.. బంగ్లా హ్యాండ్ ఇస్తుందా?, షేక్ హ్యాండ్ ఇస్తుందా తెలియాలంటే..మరికొన్ని గంటలు ఆగాల్సిందే.


ఇవి కూడా చదవండి:

తొక్కిసలాట మృతులకు నివాళిగా... RCB కీలక నిర్ణయం

ప్రభుత్వ ఉద్యోగిగా మారిన రింకు సింగ్..

Updated Date - Mar 24 , 2026 | 06:35 PM