సచిన్ తనయుడు అద్భుత బౌలింగ్.. స్టంప్స్ ఎగిరాయి.. వీడియో!
ABN , Publish Date - Apr 04 , 2026 | 08:56 PM
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ తరపున సత్తాచాటేందుకు సిద్దమవుతున్నాడు. ప్రాక్టీస్ సెషన్‌లో అర్జున్ తన యార్కర్లతో స్టంప్స్‌ను పడగొట్టాడు.
స్పోర్ట్స్ డెస్క్: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్(Arjun Tendulkar) కళ్లుచెదిరే బౌలింగ్ చేశాడు. అర్జున్ తన యార్కర్లతో స్టంప్స్‌ను పడగొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐపీఎల్ 2026లో భాగంగా అర్జు్న్ లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. మరి.. అర్జున్ సూపర్ బౌలింగ్ గురించి పూర్తి కథనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఐపీఎల్ 2026లో లఖ్‌నవూ జెయింట్స్ తరపున సత్తాచాటేందుకు సిద్దమవుతున్నాడు. ఈ సీజన్ మినీ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ నుంచి రూ.30 లక్షల కనీస ధరకు అర్జున్‌ను ఎల్ఎస్‌జీ కొనుగోలు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అర్జున్‌కు లఖ్‌నవూ తుది జట్టులో దక్కలేదు. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో లఖ్‌నవూ తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు అర్జున్ టెండూల్కర్ బౌలింగ్ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను ఎక్స్‌లో ఎల్ఎస్‌జీ షేర్ చేసింది. ఈ వీడియోలో అర్జున్ టెండూల్కర్ తన యార్కర్లతో స్టంప్స్‌ను పడగొడుతూ కనిపించాడు. అతడు లెఫ్ట్ ఆర్మ్ సీమర్ కావడంతో బంతిని లోపలికి స్వింగ్ చేస్తూ లెగ్ స్టంప్, ఆఫ్ స్టంప్స్‌ను పడగొట్టిన తీరు క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఇవి కూడా చదవండి:
ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ ఘన విజయం
ఆదుకున్న సూర్య కుమార్.. ముంబై స్కోర్ 162