ఐపీఎల్ 2026: అరుదైన మైలురాయిని తాకిన అజింక్య రహానే
ABN , Publish Date - Apr 02 , 2026 | 08:42 PM
కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే తన ఐపీఎల్ కెరీర్‌లో అరుదైన మైలురాయిని తాకాడు. ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ సన్ రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్ అతనికి 200వది.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్(IPL) 2026లో భాగంగా ఇవాళ(గురువారం) ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడిన ఎస్ఆర్ హెచ్ తొలుత బ్యాటింగ్ చేస్తోంది. ఇది ఇలా ఉంటే.. ఈ మ్యాచ్‌తో కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే తన ఐపీఎల్ కెరీర్‌లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఈ మ్యాచ్ రహానేకి 200వది. ఐపీఎల్ చరిత్రలో రహానేతో కలుపుకుని ఈ మైలురాయిని ఇప్పటివరకు కేవలం 11 మంది మాత్రమే చేరుకున్నారు.
అత్యధికంగా ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన వారి జాబితాలో ఎంఎస్ ధోని (278) అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ (273, విరాట్ కోహ్లీ (268), దినేష్ కార్తీక్ (257), రవీంద్ర జడేజా (255), శిఖర్ ధవన్ (222), రవిచంద్రన్ అశ్విన్ (221), సురేష్ రైనా (205), రాబిన్ ఉతప్ప (205), అంబటి రాయుడు (204), అజింక్య రహానే (200) వరుస స్థానాల్లో ఉన్నారు. అజింక్య రహానే 2008లో ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్, రైజింగ్ పుణే సూపర్‌జెయింట్, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల తరఫున ఆడాడు. ప్రస్తుతం కేకేఆర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో కేకేఆర్ అతన్ని తీసుకుంది.తన 18 ఏళ్ల ఐపీఎల్ ప్రయాణంలో రహనే 2 శతకాలు, 34 అర్ధ సెంచరీల సాయంతో 5099 పరుగులు చేశాడు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ కీలక వ్యాఖ్యలు
ఐపీఎల్ 2026: క్రికెట్ బోర్డుపై కేసు వేసిన ఆర్సీబీ స్టార్ ప్లేయర్