టీ20 ప్రపంచ కప్ ఫైనల్: అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ
ABN , Publish Date - Mar 08 , 2026 | 07:52 PM
టీ20 ప్రపంచ కప్ 2026 తుది పోరులో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఫైనల్‌లో అదిరిపోయే అర్ధ సెంచరీ చేశాడు. కేవలం 18 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.
స్పోర్ట్స్ డెస్క్: అందరి నమ్మకాలను టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ నిలబెట్టుకున్నాడు. టీ20 ప్రపంచ కప్ 2026 తుది పోరులో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్నఫైనల్‌లో అదిరిపోయే అర్ధ సెంచరీ చేశాడు. కేవలం 18 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో ఈ ప్రపంచ కప్‌లో తన పేరిట ఓ రికార్డును నమోదు చేసుకున్నాడు. ఈ వరల్డ్ కప్‌లో వేగంగా హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా అభిషేక్ శర్మ రికార్డు క్రియేట్ చేశాడు. మొత్తంగా టోర్నీ ప్రారంభం నుంచి విఫలమైన అభిషేక్.. కివీస్‌తో జరుగుతున్న తుదిపోరులో మాత్రం విజృంభించాడు.
అభిషేక్ శర్మ 52 పరుగుల వద్ద రచిన్ రవీంద్ర బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. అయితే క్రీజులో ఉన్నతం సేపు అభిషేక్ శర్మ బౌండరీల మోత మోగించాడు. మరో ఓపెనర్ సంజు శాంసన్ కూడా అర్ధ సెంచరీ చేశాడు. ప్రస్తుతం క్రీజులో ఇషాన్ కిషన్(34*), సంజు(67*) క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ కివీస్ బౌలర్లపై విరుచుకపడుతున్నారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 12 ఓవర్లకు 161/1.
ఇవి కూడా చదవండి:
టీ-20 వరల్డ్ కప్ మ్యాచ్.. భారత్ గెలవాలని శారీ మారథాన్..
మారిన ఐపీఎల్ 2026 ప్రారంభం తేదీ..