రోహిత్ యాదవ్‌పై వేటు
ABN , Publish Date - Sep 04 , 2026 | 01:45 AM
బెంగాల్‌కు చెందిన భారత్ అండర్-19 క్రికెటర్ రోహిత్ యాదవ్‌పై బీసీసీఐ వేటు వేసింది. వయస్సు ధ్రువీకరణలో పదే పదే మార్పులకు పాల్పడిన అతడిపై రెండేళ్ల నిషేధం విధిస్తున్నట్టు గురువారం ప్రకటించింది.
న్యూఢిల్లీ: బెంగాల్‌కు చెందిన భారత్ అండర్-19 క్రికెటర్ రోహిత్ యాదవ్‌పై బీసీసీఐ వేటు వేసింది. వయస్సు ధ్రువీకరణలో పదే పదే మార్పులకు పాల్పడిన అతడిపై రెండేళ్ల నిషేధం విధిస్తున్నట్టు గురువారం ప్రకటించింది. అండర్-19 జట్టుతో శ్రీలంకలో పర్యటించిన రోహిత్..ఈనెలలో రాజ్‌కోట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌కూ ఎంపికయ్యాడు. 2014లో బెంగాల్ క్రికెట్ సంఘంలో తన పేరు నమోదు చేసుకున్నప్పుడు జూలై 7, 2007లో పుట్టినట్టుగా రోహిత్ పేర్కొన్నాడు. 2017లో ఆధార్‌లో అప్‌డేట్ చేసినప్పుడు పుట్టిన తేదీని 2006గా మార్చాడు. ఇక..2021లో మరోసారి ఆధార్ అప్‌డేట్‌లో తన పుట్టిన తేదీని 2009కి రోహిత్ యాదవ్ మార్చడం గమనార్హం.
ఇవి కూడా చదవండి:
వాళ్లు ఓడలేదా?... భారత్‌పై పీసీబీ చీఫ్ నఖ్వీ అక్కసు