Share News

Bangladesh: గొప్పల కోసం తిప్పలు పడుతున్న బంగ్లా క్రికెట్ బోర్డు

ABN , Publish Date - Jan 07 , 2026 | 06:39 PM

భద్రతా కారణాల దృష్ట్యా భారత్ లో జరిగే తమ మ్యాచులను మరో చోటుకు తరలించాలంటూ ఐసీసీకి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు లేఖ రాసిన సంగతి తెలిసిందే. తమ లేఖకు ఐసీసీ సానుకూలంగా స్పందించిందంటూ తాజాగా బీసీబీ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. కానీ...

Bangladesh: గొప్పల కోసం తిప్పలు పడుతున్న బంగ్లా క్రికెట్ బోర్డు
Bangladesh cricket board,

ఇంటర్నెట్ డెస్క్: భారత్, బంగ్లాదేశ్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇండియాకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్(Bangladesh cricket board) పలు నిర్ణయాలు తీసుకుంది. వచ్చే నెలలో జరగనున్న టీ20 వరల్డ్‌ కప్‌ 2026 భద్రతా కారణాలను సాకుగా చూపుతూ.. తాము భారత్‌లో ఆడబోమని ఇంటర్నేషనల్ క్రికెట్ బోర్డ్(ఐసీసీ)కి లేఖ రాసింది. భారత్‌లో జరిగే మ్యాచులను మరో చోటుకు తరలించాలని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డ్‌ ఐసీసీకి విజ్ఞప్తి చేసింది.


అయితే ఐసీసీ ఇంతవరకు దీనిపై అధికారికంగా ఏవిధమైన ప్రకటన కూడా విడుదల చేయలేదు. బంగ్లాదేశ్‌ విజ్ఞప్తిని తోసిపుచ్చిందని వార్తలు కూడా వచ్చాయి. అయితే బంగ్లాదేశ్ మాత్రం ప్రపంచం ముందు లేని గొప్పలు ప్రదర్శించేందుకు విశ్వ ప్రయత్నం చేస్తోంది. తన ప్రతిపాదనలు ఐసీసీకి అందాయని, సానుకూలంగా స్పందించిందని తాజాగా బీసీబీ ప్రకటన విడుదల చేసింది(Bangladesh ICC letter).


'భద్రత కారణాల రీత్యా బంగ్లా క్రికెటర్లు భారత్‌కు వెళ్లలేరని ఇంటర్నేషనల్ క్రికెట్‌ కౌన్సిల్‌కు.. బంగ్లా క్రికెట్ బోర్డు ప్రతిపాదన చేసింది. తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని విజ్ఞప్తి చేసింది. ఈ అభ్యర్థనను ఐసీసీ అందుకుంది. బీసీబీతో కలిసి పనిచేసేందుకు ఐసీసీకి కూడా సానుకూలంగా స్పందించింది’ అని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డ్ తెలిపింది. భారత్‌, శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 మధ్య టీ20 వరల్డ్‌ కప్‌(T20 World Cup 2026) జరగనుంది. అయితే.. షెడ్యూల్‌ ప్రకారం.. బంగ్లా తమ మ్యాచ్‌లను కోల్‌కతా, ముంబైల్లో ఆడాల్సి ఉంది. గ్రూప్‌-సిలో ఉన్న ఆ జట్టు ఫిబ్రవరి 7న తన తొలి మ్యాచ్‌ను వెస్టిండీస్‌తో ఆడాల్సి ఉంది. ఆ తర్వాత ఇంగ్లాండ్‌, ఇటలీ, నేపాల్‌తో తలపడాలి. ప్రపంచకప్ ప్రారంభానికి సరిగ్గా నెల రోజుల సమయమే ఉన్నందున ఇప్పటికిప్పుడు వేదికలను మార్చడం దాదాపు అసాధ్యమని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


ఇవీ చదవండి:

Vaibhav Suryavanshi: వైభవ్ దండయాత్ర.. జడుసుకున్న సఫారీ బౌలర్లు

నేనే స్వచ్ఛందంగా తప్పుకున్నా.. ఆ వార్తల్లో నిజం లేదు: రిధిమా పాఠక్‌

Updated Date - Jan 07 , 2026 | 07:40 PM