Share News

Vaibhav Suryavanshi: వైభవ్ దండయాత్ర.. జడుసుకున్న సఫారీ బౌలర్లు

ABN , Publish Date - Jan 07 , 2026 | 03:40 PM

టీమిండియా యంగ్ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ... తన విధ్వంసాల పర్వం కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే పలు అర్ధ శతకాలు, శతకాలు బాదిన వైభవ్.. తాజాగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో సూపర్ సెంచరీ(127) కొట్టాడు.

Vaibhav Suryavanshi: వైభవ్ దండయాత్ర.. జడుసుకున్న సఫారీ బౌలర్లు
Vaibhav Suryavanshi,

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా యంగ్ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) విధ్వంసాల పర్వం కొనసాగుతోంది. ఫార్మాట్లతో సంబంధం లేకుండా చెలరేగిపోతున్నాడు. అసలు భయం అనేది లేకుండా నిర్దాక్షిణ్యంగా బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. ఇంకా చెప్పాలంటే.. ఈ 14 ఏళ్ల కుర్రాడి బ్యాటింగ్ చూసి బౌలర్లే వణికిపోతున్నారు. ఇప్పటికే అనేక మ్యాచుల్లో తనదైన విధ్వంసాన్ని చూపిన వైభవ్.. ఇవాళ భారత అండర్‌-19 జట్టు సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో చుక్కలు చూపించాడు. వైభవ్ సిక్సర్ల మోతకు సఫారీ బౌలర్ల జడుసుకున్నారు. కేవలం 74 బంతుల్లోనే 127 పరుగులు చేశాడు. అందులో 10 సిక్సర్లు, 9 ఫోర్లు ఉన్నాయి.


ప్రస్తుతం భారత అండర్‌-19 జట్టు సౌతాఫ్రికా పర్యటనలో ఉంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇవాళ (జనవరి 7) చివరి యూత్‌ వన్డే(India vs South Africa youth ODI) జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా అండర్-19 జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో యువ భారత్ జట్టు బ్యాటింగ్ చేస్తోంది. ఓపెనర్లు వైభవ్(Vaibhav Suryavanshi)( 127 ), ఆరోన్ జార్జ్(118) సెంచరీలతో చెలరేగారు.


కొనసాగుతున్న వైభవ్ విధ్వంసం:

వైభవ్‌ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) ఎక్కడా తగ్గడం లేదు. తన విధ్వంసకరమైన ఆటను కొసాగిస్తూనే ఉన్నాడు. రెండో వన్డేలోనూ ఇదే తరహాలో మెరుపు అర్ధ సెంచరీ (68) చేశాడు. అంతకుముందు విజయ్‌ హజారే ట్రోఫీలో అరుణాచల్‌ ప్రదేశ్‌పై ఉగ్రరూపం దాల్చి ఏకంగా 190 పరుగులు చేశాడు. ఈ క్రమంలో తృటిలో డబుల్‌ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. అంతకంటే ముందు అండర్‌-19 ఆసియా కప్‌లో యూఏఈపై సూపర్ సెంచరీ (171) కొట్టాడు. అదే టోర్నీలో మలేషియాపై మెరుపు అర్ద సెంచరీ చేశాడు. కేవలం ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లోనే దురదృష్టవశాత్తు తక్కువ పరుగులకే ఔటయ్యాడు. ఇటీవలికాలంలో వైభవ్‌ ప్రతి రెండు, మూడు ఇన్నింగ్స్‌లకు అర్ద శతకం కానీ శతకం కానీ చేశాడు. సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న భారత వన్డే జట్టుకు వైభవే కెప్టెన్‌.


ఇక మూడో వన్డే(India vs South Africa youth ODI)విషయానికి వస్తే.. 35 ఓవర్లు ముగిసే సరికి భారత్ 281 పరుగులు చేసింది. ప్రస్తుతం వేదాంత్ త్రివేది(25), అభిజ్ఞాన్ కుందు(1) క్రీజులో ఉన్నారు. అండర్‌-19 ప్రపంచకప్‌ సన్నాహకాల్లో భాగంగా భారత జట్టు సౌతాఫ్రికాలో పర్యటిస్తోంది. అండర్‌-19 ప్రపంచకప్‌ జింబాబ్వే, నమీబియా వేదికలుగా జనవరి 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో భారత్‌ ఆయుశ్‌ మాత్రే సారథ్యంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.


ఇవీ చదవండి:

అక్కడి నుంచి వచ్చిన వాళ్లకే జట్టులో స్థానం.. రాబిన్ ఉతప్ప ఘాటు వ్యాఖ్యలు

నేనే స్వచ్ఛందంగా తప్పుకున్నా.. ఆ వార్తల్లో నిజం లేదు: రిధిమా పాఠక్‌

Updated Date - Jan 07 , 2026 | 03:51 PM