సెమీస్‌లో గాయత్రి జోడీ
ABN , Publish Date - Nov 28 , 2026 | 01:00 AM
డిఫెండింగ్ చాంపియన్ గాయత్రి/ట్రీసా జాలీ జోడీ సయ్యద్ మోదీ బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల డబుల్స్ సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది.
సయ్యద్ మోదీ బ్యాడ్మింటన్
లఖ్‌నవూ: డిఫెండింగ్ చాంపియన్ గాయత్రి/ట్రీసా జాలీ జోడీ సయ్యద్ మోదీ బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల డబుల్స్ సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. సింగిల్స్ సెమీస్‌లో తన్వీశర్మ, ఉన్నతి హుడా అమీతుమీ తేల్చుకోనున్నారు. శుక్రవారంనాటి క్వార్టర్‌ఫైనల్లో టాప్‌సీడ్ గాయత్రి ద్వయం మార్గట్/పాగ్నెంట్ (ఫ్రాన్స్)తో తలపడాల్సి ఉంది. కానీ ప్రత్యర్థి జంట వాకోవర్ ఇవ్వడంతో గాయత్రి జోడీ సెమీస్‌కు చేరింది. కాగా సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో తన్వీ 21-19, 18-21, 21-14తో నీ కడెక్ థింగా (ఇండోనేసియా)పై పోరాడి నెగ్గింది. మరో క్వార్టర్స్‌లో ఉన్నతి హుడా 21-19, 15-21, 21-18తో సహచరి అన్మోల్ ఖర్బ్‌పై మూడు గేములు పోరాడి విజయం సాధించింది.
సెమీస్‌లో తన్వీతో ఉన్నతి తలపడనుంది. మిక్స్‌డ్ డబుల్స్‌లో సాత్విక్ రెడ్డి/రేష్మిక జోడీ 21-8, 21-14తో విరాజ్/రుతుపర్ణాపై నెగ్గి సెమీస్‌కు చేరారు. పురుషుల సింగిల్స్‌లో తుషార్ 21-19, 19-21, 9-21తో షుజీవో (ఇండోనేసియా) చేతిలో ఓడడంతో ఈ విభాగంలో భారత్ పోరు ముగిసింది. డబుల్స్‌లో అర్జున్/హరిహరన్ 21-10, 12-21, 13-21తో చలెంపాన్/థోంగ్‌సా (థాయ్‌లాండ్) చేతిలో ఓటమిపాలయ్యారు.
ఇవి కూడా చదవండి:
ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. అధికారిక ప్రకటన విడుదల
వైభవ్ సూర్యవంశీకి ప్రపంచకప్‌లో ఛాన్స్ ఇవ్వాలి: శ్రీకాంత్
ఓవరాక్షన్ తగ్గించుకో.. హర్షిత్ రాణాపై నెటిజన్లు ఫైర్!