బీడబ్ల్యూఎఫ్.. సింధుకు 9వ సీడింగ్.. సాత్విక్-చిరాగ్ జోడీకి 5వ స్థానం
ABN , Publish Date - Aug 04 , 2026 | 09:33 PM
ప్రతిష్ఠాత్మక 'బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్' సీడింగ్స్ విడుదలయ్యాయి. జపాన్ ఓపెన్ విజేత, రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత పి.వి. సింధు మహిళల సింగిల్స్ విభాగంలో 9వ సీడ్‌గా నిలిచింది.
స్పోర్ట్స్ డెస్క్: ప్రతిష్ఠాత్మక 'బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్' సీడింగ్స్ విడుదలయ్యాయి. జపాన్ ఓపెన్ విజేత, రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత పి.వి. సింధు మహిళల సింగిల్స్ విభాగంలో 9వ సీడ్‌గా నిలిచింది. 2022 ఆసియా గేమ్స్ స్వర్ణ పతక విజేతలైన సాత్విక్‌సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ పురుషుల డబుల్స్‌లో 5వ సీడింగ్ దక్కించుకుంది. ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియం వేదికగా బీడబ్ల్యూఎఫ్ టోర్నీ ఆగస్టు 17 నుంచి 23 వరకు జరగనుంది.
భారత్ తరఫున ఐదు విభాగాల్లోనూ రెండేసి ఎంట్రీలు నమోదు కాగా, నాలుగు విభాగాల్లో కనీసం ఒక సీడెడ్ క్రీడాకారుడు చోటు సాధించడం విశేషం. పురుషుల సింగిల్స్‌లో మాజీ వరల్డ్ ఛాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత లక్ష్యసేన్ 14వ సీడ్‌గా, మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల-తనీషా క్రాస్టో జంట 15వ సీడ్‌గా ఎంపికయ్యారు. రేపు (బుధవారం) టోర్నీ అధికారిక డ్రా విడుదల కానుంది. పురుషుల సింగిల్స్‌లో చైనాకు చెందిన ప్రపంచ ఛాంపియన్ షీ యుకీ, మహిళల సింగిల్స్‌లో దక్షిణ కొరియా సంచలనం అన్ సే యంగ్ అగ్ర సీడ్లుగా బరిలోకి దిగనున్నారు.
మహిళల విభాగంలో జపాన్‌కు చెందిన అకానే యమగుచి రెండో సీడ్‌గా ఎంపికవ్వగా.. చైనా షాట్లర్లు వాంగ్ జీ యీ, చెన్ యుఫెయ్ మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. పురుషుల డబుల్స్‌లో దక్షిణ కొరియాకు చెందిన కిమ్ వోన్ హో- సియో సెయుంగ్ జై జోడి టాప్ సీడ్‌గా బరిలోకి దిగుతోంది. ఉత్కంఠభరితంగా సాగే ఈ ప్రపంచ టోర్నీలో భారత క్రీడాకారులు సీడింగ్స్‌కు తగ్గట్టు రాణించి పతకాలతో మెరుస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
శ్రీలంకలో అడుగుపెట్టిన టీమిండియా.. స్టార్ ప్లేయర్ గైర్హాజరు
రహానేకు దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు: సునీల్ గావస్కర్