Share News

ఆసియా క్రీడలు.. భారత జట్టు కిట్ సమస్యకు పరిష్కారం

ABN , Publish Date - Sep 19 , 2026 | 07:06 PM

ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత పురుషుల క్రికెట్ జట్టు కిట్ విషయంలో నెలకొన్న గందరగోళానికి తెరపడింది. ఆసియా క్రీడల మ్యాచ్‌ల కోసం భారత జట్టుకు అధికారిక కిట్ అందినట్లు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి.

ఆసియా క్రీడలు.. భారత జట్టు కిట్ సమస్యకు పరిష్కారం
Asian Games 2026

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత పురుషుల క్రికెట్ జట్టు కిట్ విషయంలో నెలకొన్న గందరగోళానికి తెరపడింది. జపాన్‌తో జరగనున్న చారిత్రక ఏకైక టీ20 మ్యాచ్‌లో టీమిండియా సాధారణ బీసీసీఐ జెర్సీతోనే బరిలోకి దిగనుంది. అదే సమయంలో ఆసియా క్రీడల మిగతా మ్యాచ్‌ల కోసం భారత జట్టుకు అధికారిక కిట్ అందినట్లు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి.


‘జపాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా బీసీసీఐ జెర్సీనే ధరిస్తుంది. మిగతా టోర్నమెంట్ కోసం భారత జట్టుకు ఆసియా క్రీడల కిట్ అందింది. కిట్ విషయంలో ఉన్న సమస్య పరిష్కారమైంది’ అని మంత్రిత్వ శాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు.


జపాన్‌తో మ్యాచ్‌.. ఆసియా క్రీడల్లో భాగం కాదు

అయిచి-నగోయా వేదికగా 20వ ఆసియా క్రీడలు సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్నాయి. భారత్ 36 క్రీడాంశాల్లో పాల్గొంటోంది. గత ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్‌లో స్వర్ణం సాధించిన భారత్.. ఈసారి సెప్టెంబర్ 28న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌తో తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది.


అంతకుముందే సెప్టెంబర్ 22న జపాన్‌తో భారత్ ప్రత్యేక టీ20 మ్యాచ్ ఆడనుంది. అయితే ఈ మ్యాచ్ ఆసియా క్రీడల అధికారిక పోటీల్లో భాగం కాదని క్రీడా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇది స్నేహపూర్వక మ్యాచ్ కావడంతో భారత ఆటగాళ్లు సాధారణ బీసీసీఐ కిట్‌తోనే ఆడనున్నారని తెలిపింది.


ఇవి కూడా చదవండి:

వన్డేల్లో పంత్‌కు దాదాపు చోటు లేనట్లే: ఆకాశ్ చోప్రా

బహుశా ఇవే నా చివరి ఆసియా క్రీడలు: స్టార్ షట్లర్ ప్రణయ్

Updated Date - Sep 19 , 2026 | 07:07 PM