బహుశా ఇవే నా చివరి ఆసియా క్రీడలు: స్టార్ షట్లర్ ప్రణయ్
ABN , Publish Date - Sep 19 , 2026 | 04:33 PM
భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ ఆసియా క్రీడలపై కీలక వ్యాఖ్యలు చేశాడు. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు తనకు బహుశా చివరివని చెప్పాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ ఆసియా క్రీడలపై కీలక వ్యాఖ్యలు చేశాడు. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు తనకు బహుశా చివరివని చెప్పాడు. అయితే 2028 లాస్‌ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాలను మాత్రం ఇప్పుడే వదులుకోలేదని స్పష్టం చేశాడు. మరో ఏడాదిన్నర పాటు తన ఆటను పరిశీలించుకుని.. పోటీపడే స్థాయిలో ఉంటే ఒలింపిక్స్ కోసం ప్రయత్నిస్తానని తెలిపాడు. గత ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన ప్రణయ్.. ఈసారి 20 మంది సభ్యులతో కూడిన భారత బ్యాడ్మింటన్ జట్టులో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.
‘బహుశా ఇవే నా చివరి ఆసియా క్రీడలు. మరో నాలుగేళ్ల తర్వాత ఇదే స్థాయిలో ఆడగలనని అనుకోవడం లేదు. నేను ఆడితే అత్యున్నత స్థాయిలోనే ఆడాలి. అంతకంటే తక్కువ స్థాయిలో కొనసాగాలని అనుకోవడం లేదు. శారీరకంగా, మానసికంగా ప్రస్తుతం మంచి స్థితిలో ఉన్నాను. గత వారం వియత్నాం ఓపెన్ ఆడాను. కొంతకాలం తర్వాత మంచి ప్రదర్శన చేశాను. ఇది నాకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. గత ఆసియా గేమ్స్‌లో స్వర్ణ పతకాన్ని త్రుటిలో కోల్పోయాం. ఈసారి ఫైనల్‌కు చేరుకుని బంగారు పతకం సాధిస్తామని ఆశిస్తున్నా. నా లక్ష్యం లాస్‌ఏంజెల్స్ ఒలింపిక్స్. వచ్చే ఏడాదిన్నర కాలం పాటు ప్రయత్నిస్తాను. ఒలింపిక్స్‌కు అర్హత సాధించే వాస్తవిక అవకాశం ఉందని అనిపిస్తే కొనసాగుతాను. లేదంటే ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటాను.’ అని ప్రణయ్ అన్నాడు.
ఇవి కూడా చదవండి:
వెస్టిండీస్‌తో సిరీస్.. యశస్వికి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి: ఇర్ఫాన్ పఠాన్
యాడ్ షూట్‌లో గాయపడ్డ కివీస్ ఆల్‌రౌండర్.. భారత్‌తో సిరీస్‌కు దూరం!