ఆసియా గేమ్స్: సెమీస్‌కు దూసుకెళ్లిన భారత మహిళా జట్టు
ABN , Publish Date - Sep 18 , 2026 | 02:22 PM
ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు సెమీస్‌కు దూసుకెళ్లింది. జపాన్ వేదికగా ఆతిథ్య జట్టుతో జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో అలవోక విజయం సాధించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు సెమీస్‌కు దూసుకెళ్లింది. జపాన్ వేదికగా ఆతిథ్య జట్టుతో జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో అలవోక విజయం సాధించింది. తొలుత జపాన్ జట్టును 57 పరుగులకే ఆలౌట్ చేసింది. ఛేదనలో 2 వికెట్లు కోల్పోయి 5 ఓవర్లలోనే ఆటను ముగించి ఘన విజయం సాధించింది. షఫాలీ వర్మ(40*; 15 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో చెలరేగి ఆడింది. రిచా ఘోష్(12*; 6 బంతుల్లో 2 ఫోర్లు) రాణించింది. కమిలిని(0), భార్తీ ఫుల్మాలీ(6) పరుగులు చేశారు. జపాన్ బౌలర్లలో నొనొవో, అయక చెరో వికెట్ తీశారు.
అంతకుముందు శ్రీచరణి 4 వికెట్లతో విజృంభించడంతో జపాన్ స్వల్ప స్కోరుకే చిత్తయింది. ఓపెనర్ అయక(25) టాప్ స్కోరర్. షఫాలీ వర్మ 2, శ్రేయాంక, దీప్తి శర్మ తలొక వికెట్ పడగొట్టారు. ఇక టీమిండియా తన తదుపరి మ్యాచ్‌లో ఆదివారం బంగ్లాదేశ్‌తో తలపడనుంది. మరో క్వార్టర్ ఫైనల్‌లో మలేషియాపై శ్రీలంక విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లంక 4 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఛేదనలో మలేషియా 74 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆదివారం మరో సెమీస్‌లో పాకిస్థాన్‌తో శ్రీలంక తలపడనుంది.
ఈ వార్తలు కూడా చదవండి
పెళ్లికి ముందే బ్రేకప్