Share News

ఆసియాడ్‌ ప్రతినిధిగా అంకమ్మ చౌదరి

ABN , Publish Date - Sep 18 , 2026 | 02:39 AM

ఆంధ్ర బ్యాడ్మింటన్‌ సంఘం ప్రధాన కార్యదర్శి అంకమ్మ చౌదరికి ఆసియా క్రీడల్లో కీలక బాధ్యత దక్కింది. ఆమె భారత బ్యాడ్మింటన్‌ జట్టు అధికారిక ప్రతినిధిగా వ్యవహరించనున్నారు.

ఆసియాడ్‌ ప్రతినిధిగా అంకమ్మ చౌదరి
Ankamma Chowdary

హైదరాబాద్‌: ఆంధ్ర బ్యాడ్మింటన్‌ సంఘం (ఏపీబీఏ) ప్రధాన కార్యదర్శి అంకమ్మ చౌదరి ఆసియా క్రీడల భారత బ్యాడ్మింటన్‌ జట్టు అధికారిక ప్రతినిధిగా నియమితులయ్యారు. ఈ మేరకు భారత బ్యాడ్మింటన్‌ సంఘం అధ్యక్షుడు, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ గురువారం ప్రకటించారు. ఈనెల 19 నుంచి జపాన్‌లోని అయిచి-నగోయా వేదికగా జరిగే ఆసియా క్రీడల్లో 20 మందితో కూడిన బ్యాడ్మింటన్‌ జట్టు తలపడుతోంది.


ఈ వార్తలనూ చదవండి:

ఫేవరెట్‌ భారత్‌
అభిషేక్‌ విధ్వంసం

Updated Date - Sep 18 , 2026 | 02:39 AM