Share News

పారా షూటర్ల పతక పంట

ABN , Publish Date - Sep 17 , 2026 | 05:40 AM

పారా షూటింగ్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు పతకాల పంట పండించారు...

పారా షూటర్ల పతక పంట

న్యూఢిల్లీ: పారా షూటింగ్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు పతకాల పంట పండించారు. దక్షిణ కొరియాలోని చాంగ్వాన్‌లో జరిగిన ఈ మెగా టోర్నీలో ఆర్‌2 మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ స్టాండింగ్‌ ఎస్‌హెచ్‌1 ఈవెంట్‌లో మోనా అగర్వాల్‌, అవని లేఖార, మిల్లీ షా బృందం స్వర్ణపతకం కొల్లగొట్టింది. ఇక, ఇదే విభాగం పురుషుల టీమ్‌ ఈవెంట్‌లో రాకేశ్‌ నిడగుండి, ఆనంద కృష్ణ, స్వరూ్‌పలతో కూడిన జట్టు రజతం అందుకుంది. ఇక, మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ వ్యక్తిగత విభాగంలో మోనా రజతం, అవని కాంస్యం నెగ్గారు.

Also Read:

భారత సినీ రంగానికి అనంత్ నాగ్‌ సేవలు స్ఫూర్తిదాయకం: పవన్ కల్యాణ్

రుణాల మంజూరుపై బ్యాంకులు దృష్టి పెట్టాలి: సీఎం చంద్రబాబు

Updated Date - Sep 17 , 2026 | 05:40 AM