ఏ క్రికెటర్‌పైనా గంభీర్‌కు కోపం లేదు: కోచ్ సంజయ్ భరద్వాజ్
ABN , Publish Date - Nov 20 , 2026 | 04:31 PM
మహమ్మద్ సిరాజ్ ముస్లిం కావడం వల్లే న్యూజిల్యాండ్‌తో మొదటి టెస్టు మ్యాచ్‌లో అతడిని దూరం పెట్టారని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ చేసిన వ్యాఖ్యలపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చిన్ననాటి కోచ్ సంజయ్ భరద్వాజ్ స్పందించారు. సిరాజ్‌ను పక్కన పెట్టడం వెనుక మతానికి సంబంధించి ఎలాంటి కోణం లేదని ఆయన అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: మహమ్మద్ సిరాజ్ ముస్లిం కావడం వల్లే న్యూజిల్యాండ్‌తో మొదటి టెస్టు మ్యాచ్‌లో అతడిని దూరం పెట్టారని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ చేసిన వ్యాఖ్యలపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చిన్ననాటి కోచ్ సంజయ్ భరద్వాజ్ స్పందించారు. సిరాజ్‌ను పక్కన పెట్టడం వెనుక మతానికి సంబంధించి ఎలాంటి కోణం లేదని ఆయన అన్నారు. శుక్రవారం ఓ వార్తా సంస్థతో ఆయన మాట్లాడారు. సిరాజ్ విషయంలో హిందూ ముస్లిం కోణం లేదన్నారు. జట్టు అవసరాలు, కాంబినేషన్‌ను దృష్టిలో ఉంచుకొని టీం సెలెక్షన్ ఉంటుందన్నారు. సిరాజ్‌కు గంభీర్ ఎప్పుడూ అండగా నిలిచాడని, ఏ ఆటగాడిపైనా అతనికి కోపం లేదన్నారు. బలమైన జట్టు నిర్మాణమే హెడ్ కోచ్ ప్రాధాన్యమని పేర్కొన్నారు.
‘సిరాజ్ విషయంలో వస్తున్న వార్తలన్నీ నిరాధారం. జట్టులో ప్రతిఒక్కరూ ఇండియనే. వారంతా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు. సిరాజ్‌కు గంభీర్ ఎప్పుడూ సపోర్ట్‌గా ఉన్నాడు. జట్టు పరిస్థితి, ఆటగాళ్ల ప్రదర్శనల ఆధారంగా ఎంపిక ఉంటుంది’ అని భరద్వాజ్ వ్యాఖ్యానించారు. అలాగే, బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ కూడా జట్టు యాజమాన్యం నిర్ణయాన్ని సమర్థించాడు. కాగా.. సిరాజ్ ముస్లిం అయినందువల్లే అతడిని పక్కన పెట్టారని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ అంతకుముందు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ టస్ట్ చాంపియన్‌షిప్ సైకిల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత ఆటగాడు సిరాజ్‌ను న్యూజిల్యాండ్‌తో మొదటి టెస్టుకు దూరం పెట్టడంపై జట్టు యాజమాన్యంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
'అతిపెద్ద ద్రోహి'.. ఖవాజాపై సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డివిలియర్స్ ఆగ్రహం!
ధోని ఆటకు పాక్ అధ్యక్షుడు ముషారఫ్ ముగ్దులయ్యారు: శుక్లా