Share News

మహిళ తలకు ఫోన్ కట్టుకుని..

ABN , Publish Date - Feb 20 , 2026 | 09:05 AM

ఇటీవల సోషల్ మీడియాలో ఎన్నో రకాల ఫన్నీ, ఎమోషనల్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొంతమంది ఎవరూ ఊహించని చిత్రవిచిత్రమైన రీల్స్, వీడియోలు చేస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నారు. అలాంటి వీడియోలకు ఇంటర్నెట్‌లో సెకండ్లలో వేలు, లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి.

మహిళ తలకు ఫోన్ కట్టుకుని..
Mobile Phone Tied to Head

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల ఫన్నీ వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొంతమంది చేసే చిత్ర విచిత్రమైన పనులకు సంబంధించిన వీడియోలకు ఇంటర్నెట్‌లో వేలు, లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. వంటగదిలో పని చేసేటప్పుడు బోర్ కొట్టకుండా ఉండేందుకు ఓ మహిళ చేసిన పని చూసి నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.


వీడియోలో కనిపిస్తున్న మహిళ ఒక పొడవైన కర్రను గుడ్డ సాయంతో తలకు కట్టుకుంది. కర్ర చివరన సెల్ ఫోన్ అమర్చింది. అది సరిగ్గా ఆమె కళ్లకు ఎదురుగా ఉండేలా ఏర్పాటు చేసుకుంది. ఓ వైపు సెల్ ఫోన్‌లో తనకు ఇష్టమైన ప్రోగ్రామ్స్ చూస్తూ.. మరోవైపు ఎంచక్కా రొట్టెలు చేస్తోంది. ఏమాత్రం శ్రమ లేకుండా తనకు నచ్చిన సినిమాలు, పాటలు, సీరియల్స్ వంటివి ఆస్వాదిస్తూనే ఆమె తన పని కానిచ్చేస్తోంది. ఈ వీడియో manjotkaur.chahal అనే యూజర్ Instagramలో పోస్ట్ చేయగా.. నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఆటో-స్క్రోల్‌ను ఆన్ చేయండి’ అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేయగా, ‘వావ్.. కొత్త టాలెంట్ సూపర్’ అంటూ మరొకరు కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి:

షేక్ అవుతున్న అభిషేక్ శర్మ.. వరుసగా మూడోసారి డకౌట్..

నువ్వు అద్భుతం.. పాకిస్థాన్ ప్లేయర్‌పై ఇర్ఫాన్ పఠాన్ సెటైర్లు

Updated Date - Feb 20 , 2026 | 09:49 AM