Share News

అమ్మ ప్రేమ అట్లుంటది మరి! కోతికి సబ్బు బదులు బంగాళదుంప ఇచ్చి బుజ్జగించిన మహిళ!

ABN , Publish Date - Apr 09 , 2026 | 03:03 PM

సోషల్ మీడియాలో ఎన్నో రకాల జంతువులు, పక్షులు చేసే చిత్ర విచిత్రమైన పనులకు సంబంధించిన ఎన్నో వీడియోలు చూస్తుంటాం. కొన్ని నవ్వులు పూయించే విధంగా ఉంటే.. కొన్ని మనసుకు హత్తుకునేలా ఉంటాయి.

అమ్మ ప్రేమ అట్లుంటది మరి! కోతికి సబ్బు బదులు బంగాళదుంప ఇచ్చి బుజ్జగించిన మహిళ!
Monkey Viral Video

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో ఎన్నో రకాల జంతువులు, పక్షులు చేసే చిత్ర విచిత్రమైన పనులకు సంబంధించిన వీడియోలు చూస్తుంటాం. కొన్ని నవ్వులు పూయించే విధంగా ఉంటే.. కొన్ని మనసుకు హత్తుకునేలా ఉంటాయి. తాజాగా ఒక బెంగాలీ మహిళ, కోతికి సంబంధించిన వీడియో నెటిజన్ల మనసు గెలుచుకుంది. ఒక కోతి పొరపాటున సబ్బును ఆహారం అనుకొని తినబోతుండగా, ఆ మహిళ దాన్ని ఎంతో చాకచక్యంగా.. మాతృ ప్రేమతో ఆపిన తీరు అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక కోతి సబ్బు బిళ్ళను ఎత్తుకెళ్లి గోడపై కూర్చుంది. ఏదో తినే పదార్థం అని భావించి కొరకడానికి ప్రయత్నిస్తుండగా, అక్కడే ఉన్న ఒక మహిళ గమనించారు. సాధారణంగా కోతులు చేతిలో ఉన్న వస్తువును లాక్కోవడానికి చూస్తే ఎదురుదాడి చేస్తాయి లేదా పారిపోతాయి. కానీ, ఆ మాహిళ చాలా ప్రశాంతంగా వ్యవహరించింది. ఆ కోతిని బెదిరించకుండా, ఆమె వద్ద ఉన్న బంగాళదుంపను దానికి చూపించారు. ‘అది సబ్బు, తినకూడదు.. ఇదిగో ఇది తిను’ అన్నట్లు తల్లిలా బుజ్జగించింది. ఆమె మాటల్లోని ఆప్యాయతను గుర్తించిన కోతి, వెంటనే సబ్బును కింద పడేసి ఆమె ఇచ్చిన బంగాళదుంపను తీసుకొని వెళ్లిపోయింది.


ఈ వీడియో @the_ultimateboss_pritam119 అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ‘అమ్మ ఎప్పుడూ అమ్మే’ అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, ‘మాతృ ప్రేమకు ఏదైనా దాసోహం అనాల్సిందే’ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. ‘సబ్బు తినొద్దని అమ్మ కోతికి భలే క్లాస్ పీకింది’ అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి

హైదరాబాద్‌లో కుళ్లిన స్థితిలో మృతదేహం.. భయాందోళనలో ప్రజలు

డాక్టర్ కృతికా రెడ్డి మర్డర్ కేసు.. వెలుగులోకి భర్త మెసేజ్‌లు..

Updated Date - Apr 09 , 2026 | 03:41 PM