Share News

డాక్టర్ కృతికా రెడ్డి మర్డర్ కేసు.. వెలుగులోకి భర్త మెసేజ్‌లు..

ABN , Publish Date - Apr 09 , 2026 | 01:20 PM

కృతికా రెడ్డి హత్య 2025, ఏప్రిల్ 21వ తేదీన జరిగింది. 6 నెలల తర్వాత ఆమె భర్త డాక్టర్ మహేంద్ర రెడ్డి అరెస్ట్ అయ్యాడు. హత్య జరిగిన సంవత్సరం తర్వాత.. మహేంద్ర తన ప్రియురాలికి చేసిన మెసేజ్‌లు వెలుగులోకి వచ్చాయి.

డాక్టర్ కృతికా రెడ్డి మర్డర్ కేసు.. వెలుగులోకి భర్త మెసేజ్‌లు..
Bengaluru surgeon case

ఇంటర్‌నెట్ డెస్క్: బెంగళూరు డెర్మటాలజిస్ట్ కృతికా రెడ్డి మర్డర్ కేసు గతేడాది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రియురాలి కోసం భర్త ఆమెను దారుణంగా హత్య చేశాడు. కేసు నుంచి తెలివిగా తప్పించుకోవాలని చూశాడు. చివరకు పోలీసులకు చిక్కి జైలుపాలయ్యాడు. కృతికా రెడ్డి హత్య 2025, ఏప్రిల్ 21వ తేదీన జరిగింది. 6 నెలల తర్వాత ఆమె భర్త డాక్టర్ మహేంద్ర రెడ్డి అరెస్ట్ అయ్యాడు. హత్య జరిగిన సంవత్సరం తర్వాత.. మహేంద్ర తన ప్రియురాలికి చేసిన మెసేజ్‌లు వెలుగులోకి వచ్చాయి.


కృతికా రెడ్డిని చంపిన తర్వాత మహేంద్ర రెడ్డి తన ప్రియురాలు హర్షితకు వరుస మెసేజ్‌లు చేశాడు. ఓ మెసేజ్‌లో.. ‘ఈ మెసేజ్ చూసిన తర్వాత నువ్వు నాకు ఫోన్ కానీ, మెసేజ్ కానీ చేయవద్దు. అంతా కుదుట పడ్డాక నేనే నీకు ఫోన్ చేస్తాను. పోలీసులు నిన్ను విచారించే అవకాశం ఉంది. మన బంధం గురించి అడిగే అవకాశం ఉంది. మనం స్నేహితులమని చెప్పు’ అని అన్నాడు. మరో మెసేజ్‌లో.. ‘నా దగ్గర ఆధారాలు లేవు. కానీ, నేను కృతికను చంపేశాను. నేను కటకటాల వెనక్కు వెళ్లక తప్పదు’ అన్నాడు. మరికొన్ని మెసేజ్‌లలో భార్యను చంపినందుకు మహేంద్ర బాధ పడ్డాడు. ‘హంతకుడిగా జీవితం గడపాలి’ అంటూ ఎమోషనల్ అయ్యాడు.


పెళ్లై ఏడాది కాకముందే..

కృతికా రెడ్డి, మహేంద్ర రెడ్డికి 2024 మే నెలలో పెళ్లైంది. ఇద్దరూ బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో డాక్టర్లుగా పని చేసేవారు. హర్షిత అనే నర్సుతో మహేంద్ర ఎఫైర్ పెట్టుకున్నాడు. ఎఫైర్‌కు అడ్డుగా ఉందని భార్యను చంపేశాడు. 2025, ఏప్రిల్ 21వ తేదీన ఎనస్తీషియా ఇచ్చి భార్య ప్రాణాలు తీశాడు. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు హర్షితతో ఆన్‌లైన్ పేమెంట్ యాప్స్ ద్వారా మెసేజ్‌లు పంపేవాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. అక్టోబర్ నెలలో పోలీసులు మహేంద్రను అరెస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి

మీడియాపై దాడులకు పాల్పడటం సరికాదు: వెంకయ్య నాయుడు

ఇరాన్‌లో కిలో బియ్యం ఎంతంటే.. సమాధానం తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Updated Date - Apr 09 , 2026 | 01:28 PM