బస్సులో బ్రష్ చేసింది.. అడిగితే ఏమందంటే..
ABN , Publish Date - Mar 11 , 2026 | 08:05 PM
ఓ మహిళ.. నాగర్ కర్నూల్ జిల్లా పదరా మండలం మద్దిమడుగు వైపు నుండి అచ్చంపేటకు వెళ్లడానికి ఉదయమే బస్సు ఎక్కింది. ఇందులో ఎలాంటి విచిత్రం లేకున్నా కూడా.. ఆమె బస్ ఎక్కిన విధానమే అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది..
తెలంగాణలో మహాలక్ష్మి పథకం పేరుతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం నిర్వహణ ప్రభుత్వానికి భారమైనా కొనసాగిస్తున్నారు. అయితే కొందరు మహిళలు మాత్రం ఫ్రీ బస్సు సౌకర్యాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. చీటికీమాటికీ, అవసరం ఉన్నా లేకున్నా ఆర్టీసీ బస్సును వాడుకుంటున్నారు. ఫ్రీయే కదా.. ఎక్కితే పోలా.. అనుకుంటూ బస్సెక్కేస్తున్నారు. తాజాగా, ఓ మహిళ బస్సులో బ్రష్ చేయడం అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ.. నాగర్ కర్నూల్ జిల్లా పదరా మండలం మద్దిమడుగు వైపు నుండి అచ్చంపేటకు వెళ్లడానికి ఉదయమే బస్సు ఎక్కింది. ఇందులో ఎలాంటి విచిత్రం లేకున్నా కూడా.. ఆమె బస్ ఎక్కిన విధానమే అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. బ్రష్ చేస్తున్న ఆమె.. అలాగే బస్సు ఎక్కేసింది. సీటులో తాపీగా కూర్చుని బ్రష్ చేసుకుంటున్న ఆమెను చూసి కండక్టర్ అవాక్కైంది. ఆమె వద్దకు వెళ్లి.. ‘ఏంటమ్మా.. పళ్లు కూడా బస్సులోనే తోముకుంటావా’.. అని అడిగింది. దీనికి ఆ మహిళ.. ‘మరి టీ తాగాలని అడిగితే నువ్వు బస్సు ఆపుతావా.. లేదు కదా అందుకే ఇలా బస్సెక్కాను’.. అంటూ సమాధానం ఇచ్చింది. ఆమె సమాధానానికి సదరు మహిళా కండక్టర్ అవాక్కయింది.
తెలంగాణలో ఫ్రీ బస్సు పథకం మొదలైనప్పటి నుంచి ఇలాంటి విచిత్ర ఘటనలు అనేకం చూశాం. గతంలో కొందరు మహిళలు కూరగాయల కోసం సుదూర ప్రాంతలకు వెళ్లే బస్సులు ఎక్కడం, మరికొందరు ఏకంగా బస్సులోనే కుట్లు, అల్లికలు చేసుకోవడం, ఇంకొందరు గాలి కోసం బస్సు ఎక్కామని చెప్పడం చూసి నెటిజన్లు నోరెళ్లబెట్టారు. ఇలాంటి ఘటనలపై ఫన్నీ ట్రోల్స్, మీమ్స్ కూడా తెగ వైరల్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా, బస్‌లో బ్రష్ చేస్తున్న ఈ మహిళ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
వీరి తెలివి మామూలుగా లేదుగా.. రైల్వే ఏసీ కోచ్‌ను ఎలా మార్చారో చూడండి..
వావ్..! వాట్ ఎ టాలెంట్.. ఈ డ్రైవర్ పనితనం చూస్తే శభాష్ అనాల్సిందే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..