పెళ్లైన ఆరు నెలలకే వెళ్లిపోయి 48 ఏళ్ల తర్వాత తిరిగొచ్చింది.. టాటూనే సాక్ష్యం..
ABN , Publish Date - Jun 15 , 2026 | 09:41 PM
పెళ్లైన ఆరు నెలలకే భర్తను విడిచి వెళ్లిపోయిన భార్య.. ఏకంగా 48 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చింది. వదిలి వెళ్లిపోయిన భార్య కోసం 48 ఏళ్లు నిరీక్షించిన భర్త ఎట్టకేలకు ఆమెను కలుసుకున్నాడు.
పెళ్లైన ఆరు నెలలకే భర్తను విడిచి వెళ్లిపోయిన భార్య.. ఏకంగా 48 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చింది. వదిలి వెళ్లిపోయిన భార్య కోసం 48 ఏళ్లు నిరీక్షించిన భర్త ఎట్టకేలకు ఆమెను కలుసుకున్నాడు. యుక్త వయసులో దూరమైన ఆ జంట వృద్ధాప్యంలో ఒక్కటైంది. వీరి కథ స్థానికంగా చర్చనీయాంశంగా మారింది (Wife returns after 48 years).
బిహార్‌లోని బరియార్‌పూర్ గ్రామానికి చెందిన లలన్ మిశ్రా, నిర్మలా దేవి 1977 మార్చిలో వివాహం చేసుకున్నారు. అయితే వివాహం జరిగిన ఆరు నెలలకే అత్తింటి వేధింపుల కారణంగా నిర్మలా దేవి తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత తిరిగి భర్త వద్దకు రాలేదు. ఆమె కోసం లలన్ మిశ్రా ఎన్ని చోట్ల వెతికినా ఆచూకీ దొరకలేదు. నిర్మలను ఆమె తండ్రి నాగ్‌పూర్ తీసుకెళ్లిపోయి ఉద్యోగంలో చేర్పించారు. దీంతో ఆమె అక్కడే దాదాపు ఐదు దశాబ్దాలు ఉద్యోగం చేసింది. (Bihar couple reunion).
భార్య వెళ్లిపోయిన తర్వాత లలన్ మిశ్రా రెండో వివాహం చేసుకోలేదు (Emotional love story). ఏదో ఒక రోజు తన భార్య తప్పకుండా తిరిగి వస్తుందనే ఆశతో ఒంటరిగానే గడిపాడు. మరోవైపు నిర్మలా దేవి కూడా రెండో వివాహం చేసుకోలేదు. ఇటీవల వృద్ధాప్యంలో తన భర్త గురించి తెలుసుకోవాలనుకున్న నిర్మలా దేవి ముందుగా స్థానిక పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి సమాచారం సేకరించింది. అనంతరం నేరుగా భర్త ఇంటికి చేరుకుంది. మొదట ఆమెను ఎవరూ గుర్తుపట్టలేదు. తన చేతిపై ఉన్న టాటూను చూపించడంతో భర్త ఆశ్చర్యపోయాడు. దాదాపు 48 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన ఈ వృద్ధ దంపతుల కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి..
ఐదు కంపెనీలుగా వేదాంతా.. కొత్త కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్లో అరంగేట్రం..
అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం.. స్వాగతించిన ప్రధాని మోదీ..