బద్రీనాథ్ ఆలయానికి ముకేశ్ అంబానీ.. రూ.10 కోట్ల విరాళం..
ABN , Publish Date - Jun 15 , 2026 | 08:16 PM
ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ దర్శించుకున్నారు.
ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ దర్శించుకున్నారు. సాంప్రదాయ వస్త్రాలను ధరించి ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక హెలికాఫ్టర్‌లో బద్రీనాథ్‌కు చేరుకున్న ముకేశ్‌కు ఆలయ కమిటీ (BKTC) స్వాగతం పలికింది (Mukesh Ambani pilgrimage).
ఆలయ అధికారుల స్వాగతం మధ్య బద్రీనాథ్ చేరుకున్న అంబానీ ముందుగా స్వామిని దర్శించుకున్నారు (Ambani spiritual visit). అనంతరం కేదార్‌నాథ్ ఆలయానికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆలయాల అభివృద్ధికి, యాత్రికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ముకేశ్ రూ.10 కోట్ల విరాళాన్ని ప్రకటించినట్టు బీకేటీసీ చీఫ్ తెలిపారు. కాగా, గతంలో కూడా ముకేశ్.. బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాలను సందర్శించి ఆలయ అభివృద్ధికి విరాళాలు అందించారు.
ఇవి కూడా చదవండి..
ఐదు కంపెనీలుగా వేదాంతా.. కొత్త కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్లో అరంగేట్రం..
అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం.. స్వాగతించిన ప్రధాని మోదీ..