Share News

ప్రపంచంలో అత్యధిక కండోమ్‌లు మలేషియా నుంచే.. ఈ దేశం ఎలా నంబర్-1గా నిలిచింది..

ABN , Publish Date - Jul 18 , 2026 | 01:44 PM

ప్రపంచంలో అత్యధిక కండోమ్‌లను తయారు చేసే దేశం మలేషియా. ఈ దేశానికి చెందిన 'కారెక్స్' ప్రపంచంలోనే అతిపెద్ద కండోమ్ తయారీ సంస్థగా గుర్తింపు పొందింది.

ప్రపంచంలో అత్యధిక కండోమ్‌లు మలేషియా నుంచే.. ఈ దేశం ఎలా నంబర్-1గా నిలిచింది..
Malaysia condom industry

ప్రపంచంలో అత్యధిక కండోమ్‌లను తయారు చేసే దేశం మలేషియా. ఈ దేశానికి చెందిన 'కారెక్స్' (Karex) ప్రపంచంలోనే అతిపెద్ద కండోమ్ తయారీ సంస్థగా గుర్తింపు పొందింది. ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే ప్రతి ఐదు కండోమ్‌లలో ఒకటి కారెక్స్ ఫ్యాక్టరీల్లోనే తయారవుతుందని కంపెనీ చెబుతోంది. ఏటా 500 కోట్లకు పైగా కండోమ్‌లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఈ సంస్థకు ఉంది (Malaysia condom industry).


ప్రపంచంలోనే సహజ రబ్బరు (Natural Latex) ఉత్పత్తి దేశాల్లో మలేషియా ఒకటి. కండోమ్ తయారీకి అవసరమైన నాణ్యమైన లాటెక్స్ సులభంగా లభించడం, ఆధునిక తయారీ సాంకేతికత, తక్కువ ఉత్పత్తి వ్యయం, నైపుణ్యం కలిగిన కార్మికుల వల్ల మలేషియా ఈ రంగంలో అగ్రస్థానంలో నిలిచింది. 1988లో ప్రారంభమైన కారెక్స్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రముఖ బ్రాండ్లకు కండోమ్‌లను సరఫరా చేస్తోంది.

condoms2.jpg


డ్యూరెక్స్ (Durex) వంటి అంతర్జాతీయ బ్రాండ్లకు కూడా కారెక్స్ సంస్థ తయారీ భాగస్వామిగా ఉంది. అలాగే ఐక్యరాజ్యసమితి (UN), ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), పలు ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలకు కూడా ఈ సంస్థ కండోమ్‌లను సరఫరా చేస్తోంది. కారెక్స్ సంస్థకు మలేషియాతో పాటు థాయ్‌లాండ్‌లో కూడా ఫ్యాక్టరీలు ఉన్నాయి. ప్రపంచ మార్కెట్లో సుమారు 20 శాతం కండోమ్‌ల సరఫరా ఈ సంస్థ ద్వారానే జరుగుతుంది.


కాగా, ఇటీవలి పశ్చిమాసియాలోని ఉద్రిక్తతల కారణంగా మలేషియాలోని కండోమ్ పరిశ్రమ కూడా ఆటంకాలు ఎదుర్కొంటోంది (Malaysia rubber industry). ముడి పదార్థాల ధరల పెరుగుదల, రవాణా వ్యయాలు పెరగడం వల్ల కారెక్స్ తన ఉత్పత్తుల ధరలను 20 నుంచి 30 శాతం వరకు పెంచనున్నట్టు ప్రకటించింది. సరఫరా వ్యవస్థపై ఒత్తిడి పెరగడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సంస్థ పేర్కొంది.


ఇవి కూడా చదవండి..

పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..


రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలు.. సెలక్టర్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు..

Updated Date - Jul 18 , 2026 | 01:44 PM