హోటల్ లిఫ్ట్‌లో చిక్కుకున్న శశి థరూర్.. అరగంట తర్వాత సురక్షితంగా బయటకు..
ABN , Publish Date - Jul 18 , 2026 | 12:28 PM
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కేరళం రాజధాని తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ హోటల్ లిఫ్ట్‌లో కొంతసేపు చిక్కుకుపోయారు. లిఫ్ట్ అకస్మాత్తుగా ఆగిపోవడంతో ఆయనతో పాటు మరికొందరు అరగంట పాటు అందులోనే ఉండిపోయారు.
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కేరళం రాజధాని తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ హోటల్ లిఫ్ట్‌లో కొంతసేపు చిక్కుకుపోయారు. లిఫ్ట్ అకస్మాత్తుగా ఆగిపోవడంతో ఆయనతో పాటు మరికొందరు అరగంట పాటు అందులోనే ఉండిపోయారు. సమాచారం అందుకున్న కేరళం ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని అందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు (Shashi Tharoor in Kerala hotel lift).
శశి థరూర్ తిరువనంతపురంలోని రోటరీ క్లబ్ ఆఫ్ త్రివేండ్రం ఈస్ట్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు శుక్రవారం సాయంత్రం ఓ ప్రైవేట్ హోటల్‌కు వెళ్లారు. ఆరో అంతస్తుకు వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కిన కొద్ది సేపటికే అది మధ్యలో నిలిచిపోయింది. ఆయనతో పాటు మొత్తం ఏడుగురు లిఫ్ట్‌లో చిక్కుకుపోయారు. హోటల్ సిబ్బంది మొదట లిఫ్ట్‌ను తెరవడానికి ప్రయత్నించినా సాధ్యపడలేదు. దీంతో వారు ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్‌కు సమాచారం అందించారు (Kerala hotel lift malfunction).
రెస్క్యూ సిబ్బంది ప్రత్యేక హైడ్రాలిక్ స్ప్రెడర్ పరికరాన్ని ఉపయోగించి లిఫ్ట్ తలుపులు తెరిచి శశి థరూర్‌తో పాటు మిగిలిన వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మొత్తం 15 నుంచి 30 నిమిషాల పాటు శశిథరూర్ లిఫ్ట్‌లో చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. రక్షణ చర్యలు పూర్తయ్యాక శశి థరూర్ చిరునవ్వుతో లిఫ్ట్ నుంచి బయటకు వచ్చారు. అనంతరం ఫైర్ అండ్ రెస్క్యూ సిబ్బందిని అభినందించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి..
పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలు.. సెలక్టర్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు..