20 అడుగుల కొండచిలువపై జారుడు బండ ఆట
ABN , Publish Date - Nov 11 , 2026 | 04:36 PM
సాధారణంగా కొండచిలువను చూస్తే మనలో చాలా మంది భయంతో పారిపోతుంటారు. కానీ, ఇండోనేషియాలో కొందరు పిల్లలు మాత్రం ఒక కొండచిలువ వీపుపై ఎక్కి జారుడు బండ ఆట ఆడారు.
ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా కొండచిలువను చూస్తే మనలో చాలా మంది భయంతో పారిపోతుంటారు. కానీ, ఇండోనేషియాలో కొందరు పిల్లలు మాత్రం ఒక కొండచిలువ వీపుపై ఎక్కి జారుడు బండ ఆట ఆడారు. అదేదో చనిపోయిన కొండచిలువ అనుకుంటే పొరపాటే. బతికున్న కొండచిలువే. అది కూడా 20 అడుగుల పొడవు ఉంది. అలాంటి కొండచిలువ వీపుపై ఏమాత్రం భయం లేకుండా ఎక్కి సరదాగా జారుడు బండ ఆట ఆడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొండచిలువ చుట్టుపక్కల కొంతమంది పెద్దలు ఉన్నా.. పిల్లలను వారించకుండా తమ స్మార్ట్ఫోన్లలో వీడియో తీశారు. కాగా.. ఆ కొండచిలువ విషపూరితం కానిదని, అయినా కూడా ముప్పు ఉందని పసిగడితే, దాడిచేసి చంపేయగలవమని అటవీ అధికారులు తెలిపారు.
ఇక ఆ వీడియోపై నెటిజన్లు వివిధ రకాల కామెంట్లు చేశారు. కొందరు జోకులు వేయగా.. మరికొందరు పిల్లల చర్యను తీవ్రంగా ఖండించారు. ‘ఇండోనేషియాలో సాధారణంగా రెటిక్యులేటెడ్ (శరీరంపై వల లాంటి ఉన్నవి) కొండచిలువలను వాటి లివర్ ఆయిల్ కోసం పెంచుతారు. సాధారణంగా ఐదడుగుల కొండచిలువను 5 డాలర్లకు అమ్ముతారు. అయితే, అడవుల్లో ఉండే కొండచిలువులు చాలా ప్రమాదకరమైనవి. ముప్పు ఏర్పడినట్లు పసిగడితే వెంటనే దాడి చేస్తాయి’ అని ఒక యూజర్ కామెంట్ చేశారు. కంప్యూటర్ గేమ్స్ ఆడకుండా ఆ పిల్లలు కొండచిలువతో ఆడుకుంటున్నారని మరో యూజర్ కామెంట్ చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
కశ్మీర్లో వింటర్ టూరిజం సందడి.. గుల్మార్గ్లో తొలి మంచు వర్షం!
డేటింగ్ యాప్.. 3 ఏళ్లల్లో పెళ్లి కాకపోతే..