డేటింగ్ యాప్.. 3 ఏళ్లల్లో పెళ్లి కాకపోతే..
ABN , Publish Date - Nov 10 , 2026 | 10:48 PM
డేటింగ్ యాప్స్‌పై ప్రపంచవ్యాప్తంగా నిరాసక్తత పెరుగుతోంది. ఎన్నో ప్రొఫైల్స్ ఉన్నప్పటికీ నచ్చిన వ్యక్తి దొరకక విసిగిపోతున్న అనేక మంది డేటింగ్ యాప్స్ జోలికే వెళ్లడం మానేస్తున్నారు. ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు చైనాలోని ఓ డేటింగ్ యాప్ కొత్త ఆఫర్‌తో ముందుకు వచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: డేటింగ్ యాప్స్‌పై ప్రపంచవ్యాప్తంగా నిరాసక్తత పెరుగుతోంది. ఎన్నో ప్రొఫైల్స్ ఉన్నప్పటికీ నచ్చిన వ్యక్తి దొరకక విసిగిపోతున్న అనేక మంది డేటింగ్ యాప్స్ జోలికి వెళ్లడం మానేస్తున్నారు. ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు చైనాలోని ఓ డేటింగ్ యాప్ కొత్త ఆఫర్‌తో ముందుకు వచ్చింది. తమ యాప్‌లో చేరాక మూడేళ్లల్లోపు జీవిత భాగస్వామి లభించకపోతే డబ్బు వాపస్ ఇచ్చేస్తామని హామీ ఇచ్చింది.
పెళ్లిళ్లు జరిగే అవకాశాలు పెంచేందుకు కూడా తమ యాప్‌లో ఆ సంస్థ స్వల్ప మార్పులు చేసింది. సాధారణ యాప్‌లల్లో నచ్చిన వ్యక్తులు అనేక మందితో ఒకే సారి చాటింగ్ చేసి మనసుకు దగ్గరైన వారితో డేటింగ్‌ను మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కానీ ఇది ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదని భావించిన చైనా సంస్థ ఈ మ్యాచ్‌ల సంఖ్యను కుదించింది. ఒకసారి ఒకరితోనే చాటింగ్‌కు అవకాశం కల్పించేలా ఆప్షన్‌ను తీసుకొచ్చింది.
ప్రభుత్వ ఉద్యోగుల కోసం డేటింగ్ యాప్
సింగపూర్ ప్రభుత్వ వర్కర్ల కోసం కూడా ఓ డేటింగ్ యాప్ అందుబాటులోకి వచ్చింది. 21 నుంచి 35 ఏళ్ల లోపు వారికే ఈ యాప్ పరిమితం. స్వైప్ ఫాటిగ్‌కు చెక్ పెట్టి, మనసుకు నచ్చిన వారిని సొంతం చేసుకునేలా ఈ యాప్‌ను డిజైన్ చేశారు. సింగపూర్‌లో జనాభా అంతకంతకూ పడిపోతున్న నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దాలనే తాపత్రయంతో ప్రభుత్వం ఈ యాప్‌ను తీసుకొచ్చింది.
ఈ వార్తలనూ చదవండి:
ఏనుగును వేధించిన యువకులు.. తోక పట్టుకుని లాగుతూ వికృత చేష్టలు..
గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డాడు.. చివరకు ఏమైందో చూస్తే షాకవ్వాల్సిందే..