ఇంద్ర ధనస్సును కెమెరాతో రికార్డు చేస్తుండగా షాకింగ్ దృశ్యం!
ABN , Publish Date - Nov 11 , 2026 | 04:04 PM
అమెరికాలో ఇటీవల ఓ మహిల రికార్డు చేసిన వీడియో వైరల్గా మారింది. వీడియోలో కనిపించేది గ్రహాంతరవాసుల వ్యోమనౌకేనని నెటిజన్లు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: గ్రహాంతరవాసుల ఉనికిపై నెట్టింట నిత్యం చర్చ జరుగుతూనే ఉంటుంది. వారు నిజంగానే ఉన్నారని వాదించే వారు ఎక్కువ. అనంతమైన విశ్వంలో గ్రహాంతర వాసులు ఉండవచ్చని ఆధునిక శాస్త్రం కూడా చెబుతోంది. అయితే, వారికి మన భూమి గురించి తెలుసా? ఎప్పుడైనా ఇక్కడకు వచ్చి వెళ్లారా? అనే అంశంపై మాత్రం కొంత సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో (Alaska UFO Video) జనాల్లో అమితాసక్తిని రేకెత్తిస్తోంది.
అలాస్కాలో (యూఎస్ఏ) జేన్ ఆస్బార్న్ అనే మహిళ ఈ వీడియోను రికార్డు చేశారు. ఈ ఏడాది జూన్లో తాను యాంకరేజ్ ప్రాంతంలో కారులో వెళుతూ ఇంద్ర ధనస్సును రికార్డు చేస్తుండగా ఓ వింత దృశ్యం కంటపడిందని చెప్పారు. గాల్లో ఓ వింత ఆకారం యూఎస్ మిలిటరీ స్థావరం వైపు వెళుతూ కనిపించిందని ఆమె పేర్కొన్నారు. ఆ ఆకారానికి ఆక్టోపస్ లాంటి చేతులు ఉన్నాయని అన్నారు. అవి వేటికవే స్వతంత్రంగా కదులుతూ కనిపించాయని చెప్పారు. ఇది గ్రహాంతరవాసుల వ్యోమనౌక అయి ఉండవచ్చని అన్నారు.
ఈ వీడియోకు నెట్టింట భారీ స్పందన వచ్చింది. ఆ వింత ఆకారం కచ్చితంగా గ్రహాంతరవాసుల వ్యోమనౌక (UFO) అయి ఉండవచ్చని అన్నారు. అది స్వయంగా గ్రహాంతరవాసేనని (Alien) మరికొందరు అన్నారు. ఇంకొందరు మాత్రం ఈ వాదనలను కొట్టిపారేశారు. అది గాలిపటం అని చెప్పారు. ఆ ప్రాంతంలో అలాంటి గాలిపటాలు సర్వసాధారణమని వివరించారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
ఈ వార్తలనూ చదవండి:
కశ్మీర్లో వింటర్ టూరిజం సందడి.. గుల్మార్గ్లో తొలి మంచు వర్షం!
డేటింగ్ యాప్.. 3 ఏళ్లల్లో పెళ్లి కాకపోతే..