Share News

పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం తథ్యం.. ఈ తాబేలు ఏం చేసిందో చూడండి..

ABN , Publish Date - Jul 01 , 2026 | 12:12 PM

చిన్ననాటి నుంచి చాలా కథలు చదువుతుంటాం. వయస్సు పెరుగుతున్న క్రమంలో చదివిన కథలు.. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తెలియజేస్తుంటాయి. ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నామంటే.. తాజాగా ఓ తాబేలు వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం తథ్యం.. ఈ తాబేలు ఏం చేసిందో చూడండి..

ఇంటర్నెట్ డెస్క్: చిన్ననాటి నుంచి చాలా కథలు చదువుతుంటాం. వయస్సు పెరుగుతున్న క్రమంలో చదివిన కథలు.. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తెలియజేస్తుంటాయి. ఆయా కథల్లో పాత్రలన్నీ ఎక్కువగా జంతువులతోనే నిండి ఉంటాయన్న విషయం తెలిసిందే. తాబేలు, కుందేలు పరుగు పందెం కథ, ముసలి, కోతి గుండె కాయ కథ మనందరికీ తెలుసు. అలాగే పంచతంత్రం కథలల్లోని పాత్రల్లో పక్షులే ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నామంటే.. తాజాగా ఓ తాబేలు వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.


ఓ తాబేలుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంటి ఆవరణలోని మెట్లపై వర్షం పడుతోంది. అదే సమయంలో మెట్లపైకి తాబేలు ఎక్కేందుకు ప్రయత్నం చేస్తోంది. ఏ మాత్రం తన ముందు కాళ్లు పట్టు తప్పినా.. ఆ తాబేలు కిందకు పడిపోతుంది. అయితే ఆ తాబేలు మాత్రం పట్టు తప్పకుండా.. పట్టుదలతో పైమెట్టుకు చేరింది. అనుకున్న లక్ష్యాన్ని సాధించే క్రమంలో.. పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యమని తాబేలు మరోసారి ఈ వీడియో ద్వారా స్పష్టం చేస్తోంది.


ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. తాబేలు ప్రయత్నానికి హ్యాట్సాఫ్ అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. పట్టుదలకు ప్రతీక తాబేలు అని మరో నెటిజన్ అభిప్రాయపడ్దారు. దీని ఆలోచనలు మాత్రం పక్కా క్లారిటీతో ఉంటాయని ఇంకో నెటిజన్ వివరించారు.

Updated Date - Jul 01 , 2026 | 04:14 PM