Share News

వైరల్ కోతికి గర్ల్ ఫ్రెండ్ దొరికింది.. సోషల్ మీడియాలో జోకులు

ABN , Publish Date - Mar 22 , 2026 | 11:10 AM

జపాన్‌లోని ఇచికావా సిటీ జూలో, పంచ్ అనే పేరుగల ఒక జపనీస్ మకాక్ కోతి పిల్లను చిన్నతనంలో తల్లి దూరం పెట్టడంతో ఒంటరిగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ఇప్పుడు పంచ్‌కి ఓ కొత్త ఫ్రెండ్ దొరికింది. వివరాల్లోకి వెళితే..

వైరల్ కోతికి గర్ల్ ఫ్రెండ్ దొరికింది.. సోషల్ మీడియాలో జోకులు
Viral Monkey Video

ఇంటర్నెట్ డెస్క్: జపాన్‌లోని ఇచికావా సిటీ జూలో, పంచ్ అనే పేరుగల ఒక జపనీస్ మకాక్ కోతి పిల్లను చిన్నతనంలో తల్లి దూరం పెట్టడంతో ఒంటరిగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. జూ సిబ్బంది ఆ కోతి పిల్ల ఒంటరితనం చూసి జాలితో ఒక ఒరాంగుటాన్ బొమ్మ దానికి ఇచ్చారు. అప్పటి నుంచి కోతి పిల్ల అమాయకంగా బొమ్మతో ఆడుకోవడం, పడుకోవడం చూసి సందర్శకులు ఎంతో ఎమోషన్ అయ్యారు. కోతి పిల్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఈ మధ్యనే వైరల్ కోతి పిల్లను తల్లి‌తో పాటు మిగతా కోతులు దగ్గరకు తీయడంతో అందరూ సంతోషించారు. తాజాగా పంచ్‌కి సంబంధించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


జపనీస్ మకాక్ కోతి పిల్ల(పంచ్)కు ఇప్పుడు కొత్త తోడు దొరికింది. తనకంటే కొంచెం పెద్దదైన మోమో-చాన్ అనే పేరుగల ఆడ మకాక్ కోతితో పంచ్‌కు స్నేహం ఏర్పడింది. ఆ రెండూ తరచుగా పక్కపక్కనే కూర్చొని ఆడుకోవడం, ముద్దులు పెట్టుకోవడానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పంచ్ ‘ప్రేమ జీవితం’ జీవితం సరదాగా గడిచిపోతుందని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. ‘పంచ్‌కి గర్ల్ ఫ్రెండ్ దొరికింది’ అని సరదాగా మరోకరు కామెంట్ చేశారు. ‘పంచ్ ఫేమస్ కాబట్టే ఫ్రెండ్ దొరికింది’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మరో 260 వందేభారత్‌ స్లీపర్‌ రైళ్ల తయారీ

ఆర్టీసీలో 198 పోస్టులకు 29న రాత పరీక్ష

Read Latest Telangana News and National News

Updated Date - Mar 22 , 2026 | 01:22 PM