ఇదెక్కడి ట్యాలెంట్ నాయనా.. ఇటుకలు, సిమెంట్‌తో కారును ఎలా రిపేర్ చేస్తున్నాడో చూడండి..
ABN , Publish Date - Apr 30 , 2026 | 01:01 PM
సోషల్ మీడియా ప్రపంచం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వినోదాత్మక, ఆకర్షణీయ, వినూత్న వీడియోలు నెటిజన్లను ఆకర్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. ఆ వీడియోలు సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుని బాగా వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియా ప్రపంచం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వినోదాత్మక, ఆకర్షణీయ, వినూత్న వీడియోలు నెటిజన్లను ఆకర్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. ఆ వీడియోలు సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుని బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి కారును సిమెంట్, ఇటుకలతో రిపేరు చేసిన తీరుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Viral car jugaad).
@RealTofanOjha అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక కారు వెనుక భాగం దెబ్బతింది. అలా జరిగినపుడు ఎవరైనా తమ కారును మెకానిక్ దగ్గరకో, షోరూమ్‌కో తీసుకెళ్లి రిపేర్ చేయించుకుంటారు. అయితే ఈ వీడియోలోని వ్యక్తి మాత్రం తన కారును తాపీ మేస్త్రి దగ్గరకు తీసుకెళ్లాడు. ఆ తాపీ మేస్త్రి ఇటుక, సిమెంట్‌తో దెబ్బతిన్న భాగాన్ని సరిచేస్తున్నట్టు ఆ వీడియోలో కనిపిస్తోంది (Car repair cheap viral).
ఈ వెరైటీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వేల మంది ఈ వీడియోను వీక్షించారు (Desi jugaad auto repair). వందల మంది ఈ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. 'షోరూమ్ వాళ్లు ఎక్కువ అడిగారు. కానీ మేస్త్రి రూ. 200కే అతికించేశాడు' అని ఈ వీడియో పోస్ట్ చేసిన యూజర్ కామెంట్ చేశారు. 'ఇది నిజంగా పని చేస్తుందా' అని ఒకరు ప్రశ్నించారు. ఇలాంటి తెలివితేటలు భారతీయులకే వస్తాయని మరొకరు సరదాగా కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
బంగారం కొనాలనుకుంటున్నారా.. మరింత తగ్గిన ధరలు..
రష్యాలో మరో ఆయిల్ కేంద్రంపై దాడి.. డ్రోన్ శక్తిని చూపిస్తున్న ఉక్రెయిన్..