Share News

తండ్రిపై దాడి చేశారని ఆరోపణ.. హోటల్‌ను ధ్వంసం చేసిన అక్కాచెల్లెళ్లు.. వీడియో వైరల్

ABN , Publish Date - Nov 16 , 2026 | 05:23 PM

తమ తండ్రిపై హోటల్ సిబ్బంది దాడి చేశారన్న ఆరోపణతో ఇద్దరు అక్కాచెల్లెళ్లు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని ఆరోపిస్తూ వారణాసిలోని ఓ రోడ్డు పక్క హోటల్‌పై విరుచుకుపడి, అక్కడి వస్తువులను ధ్వంసం చేశారు.

తండ్రిపై దాడి చేశారని ఆరోపణ.. హోటల్‌ను ధ్వంసం చేసిన అక్కాచెల్లెళ్లు.. వీడియో వైరల్
Varanasi Incident

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఓ భోజనశాల వద్ద ఇద్దరు అక్కాచెల్లెళ్లు హల్‌చల్‌ చేశారు. తమ తండ్రిపై రెస్టారెంట్ సిబ్బంది దాడి చేశారన్న ఆరోపణతో ఆగ్రహానికి గురైన వారు.. ఏకంగా ఆ హోటల్‌ను ధ్వంసం చేశారు. నవంబర్ 4న మహిళల తండ్రికి రెస్టారెంట్ సిబ్బందితో వాగ్వాదం జరగగా.. అది తీవ్ర ఘర్షణకు దారితీసి ఆయనపై దాడి జరిగినట్లు సమాచారం.

ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు భేలుపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. దీంతో పోలీసుల స్పందనపై అసహనం వ్యక్తం చేసిన అక్కాచెల్లెళ్లు స్వయంగా రెస్టారెంట్ వద్దకు చేరుకుని నిరసనకు దిగారు. ఈ క్రమంలో అక్కడి వస్తువులను చిందరవందర చేసి.. పిండితో ఉన్న కంటైనర్‌ను కిందపడేశారు. ఓ ఉద్యోగిపై నీళ్లు చల్లుతూ రెస్టారెంట్‌ను మూసివేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహిళలు హోటల్ వద్ద గొడవ చేస్తుండటంతో స్థానికులు వారిని శాంతింపజేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అక్కడ పిల్లలు ఉన్నారని.. గొడవ చేయవద్దని ఓ మహిళ సూచించగా ఆమెపై కూడా అక్కాచెల్లెళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా స్థానికులు జోక్యం చేసుకున్నారు. మరోవైపు.. మహిళలు తన మాట వినకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రెస్టారెంట్ యజమాని వెల్లడించారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ఏసీపీ గౌరవ్ కుమార్ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల

సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్

Read Latest Telangana News And AP News

Updated Date - Nov 16 , 2026 | 07:12 PM