బైక్‌లు నడపలేం.. రిక్షాపై ఎక్కించాల్సిందే.. ఖాకీల వీడియో వైరల్
ABN , Publish Date - Sep 04 , 2026 | 12:06 PM
భారీ వర్షాల కురిస్తే రహదారులు పూర్తిగా జలమయమవుతాయి. మోకాళ్ల లోతు నీరు రహదారులపైకి వచ్చి చేరుతుంది. అలాంటి పరిస్థితుల్లో వాహనాలు నడప లేని పరిస్థితి ఏర్పడుతుంది.
ఇంటర్నెట్ డెస్క్: భారీ వర్షాల కురిస్తే రహదారులు పూర్తిగా జలమయమవుతాయి. మోకాళ్ల లోతు నీరు రహదారులపైకి వచ్చి చేరుతుంది. అలాంటి పరిస్థితుల్లో వాహనాలు నడప లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఓ వేళ వాహనాలు నడిపితే.. సైలెన్సర్‌తోపాటు ఇంజిన్‌లోకి నీళ్లు వెళ్లిపోతాయి. దీంతో వాహనం పాడవుతుంది. దానిని బాగు చేయాలంటే చాలా ఖర్చువుతోంది. ఆ విషయాన్ని ఆ పోలీసులు ముందుగానే ఊహించినట్లు ఉన్నారు. అందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది.
అపాచీ బైక్‌ను మూడు చక్రాల వాలు రిక్షాపై ఎక్కించారు. దానిని ఇద్దరు పోలీసులు గట్టిగా పట్టుకుని నిల్చనున్నారు. ఆ నీటిలో ఓ వ్యక్తి ఆ రిక్షాను చాలా బలంగా లాగుతున్నాడు. మరో వ్యక్తి ఆ రిక్షాను వెనుక నుంచి గట్టిగా నెడుతున్నాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత రహదారిపై నీరు మరింత పెరిగి ఉంది. రిక్షాపై నిలబడిన ఇద్దరిలో ఓ పోలీసు కిందికి దిగిపోయాడు. అనంతరం ఆ రిక్షాను వెనుక నుంచి నెట్టేందుకు మరో వ్యక్తి వచ్చాడు. దీంతో ఆ రిక్షా వేగం పుంజుకుంది. అదే సమయంలో ఓ వాహనాన్ని నిలిపి ఉంచి మరో రిక్షా దీనికి ఎదురుగా వచ్చి.. దాటుకుంటూ వెళ్లింది. ఈ రిక్షాపై బైక్ పట్టుకుని నిలబడిన వ్యక్తి.. హెల్మట్ పెట్టుకుని ఉన్నాడు.
అదే మార్గంలో ఇంకో రిక్షాపై బైక్‌ను అలాగే నిలిపి ఉంచి తీసుకువస్తున్నారు. ఆ మార్గంలో నడిచే రిక్షాలన్నీ దాదాపుగా అదే విధంగా బైక్‌లను తీసుకొస్తున్నాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఏ జిల్లాలో ఇది జరిగిందనే దానిపై సమాచారం లేదు. ఈ వీడియోను shayamyadavsp95 ఎక్స్ పేజీలో షేర్ చేశారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. రహదారి నదిగా మారినప్పుడు.. వాహనం పడవగా మారుతోందని కామెంట్ పెట్టాడు. మరో నెటిజన్ అయితే.. ఈ ఖాకీల స్టైల్ వెరైటీగా ఉందని.. దీనినే స్మార్ట్ వర్క్ అంటారని గుర్తు చేశాడు.