Share News

ఇంట్లో సాలెపురుగులను సహజంగా ఎలా వదిలించుకోవాలి?

ABN , Publish Date - Mar 30 , 2026 | 05:48 PM

ఇంట్లో సాలెగూళ్లు కనిపించడం చాలా మందికి అసహనాన్ని కలిగిస్తుంది. ఇవి ఇంటి అందాన్ని తగ్గించడమే కాకుండా, ఆరోగ్య సమస్యలకు కూడా కారణమవుతాయి.

ఇంట్లో సాలెపురుగులను సహజంగా ఎలా వదిలించుకోవాలి?
Spider Control Home Remedies

ఇంటర్నెట్ డెస్క్: ఇల్లు ఎంత శుభ్రంగా ఉన్నా, సాలెగూళ్లు కనిపిస్తే అసహ్యంగా అనిపిస్తుంది. ఇవి ఇంటి అందాన్ని తగ్గించడమే కాకుండా, కొందరికి అలర్జీలు, శ్వాస సమస్యలు కూడా పెంచవచ్చు. అయితే కెమికల్స్ వాడకుండా సహజమైన పద్ధతులతోనే సాలెపురుగులను సులభంగా దూరం చేయవచ్చు. అలాంటి సింపుల్ చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం..


వెనిగర్

సాలె పురుగులను ఇంట్లో నుండి దూరం చేయడానికి వెనిగర్ ఒక అద్భుతమైన, సహజమైన నివారణ మార్గం. ఒక కప్పు వెనిగర్‌లో 2–3 వెల్లుల్లి రెబ్బలు నూరి కలపాలి. దీన్ని స్ప్రే బాటిల్‌లో పోసి, సాలెపురుగులు ఎక్కువగా ఉండే చోట స్ప్రే చేయాలి. ఈ వాసనను అవి తట్టుకోలేవు. ఫలితంగా, ఇంటి నుండి పారిపోతాయి.

పుదీనా నీరు

పుదీనా ఆకులు కూడా సాలె పురుగులను ఇంటి నుండి దూరం చేస్తాయి. గుప్పెడు పుదీనా ఆకులను తీసుకుని, కొద్దిగా నీళ్ళు పోసి మెత్తని పేస్ట్‌లా నూరాలి. పుదీనా వాసన సాలెపురుగులకు అసహ్యం, కాబట్టి అవి ఇంటికి దూరంగా వెళ్లిపోతాయి.

Mint Leaves (1).jpg


దాల్చినచెక్క పొడి

ఇంటి మూలల్లో లేదా గూళ్లు ఉన్న చోట దాల్చినచెక్క పొడి చల్లాలి. దీని ఘాటైన వాసన సాలెపురుగులను తరిమేస్తుంది.

నిమ్మ తొక్కల స్ప్రే

నిమ్మ తొక్కలను నూరి గోరువెచ్చని నీటిలో కలిపి స్ప్రే చేయాలి. ఈ సిట్రస్ వాసన సాలెపురుగులను దూరంగా ఉంచుతుంది.

Lemon (1).jpg


కర్పూరం

ఇంటి మూలల్లో కర్పూరం ఉంచితే దాని వాసనకు సాలెపురుగులు దూరమవుతాయి.

ఈ సహజ పద్ధతులు పాటిస్తే సాలెపురుగులను సులభంగా దూరం చేయవచ్చు. క్రమం తప్పకుండా ఇల్లు శుభ్రం చేస్తూ ఈ చిట్కాలు ఉపయోగిస్తే ఇంటి వాతావరణం శుభ్రంగా ఉంటుంది.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

ఈ వార్తలు కూడా చదవండి..

పాలను ఇలా తాగితే హైబీపీకి చెక్.. సింపుల్ చిట్కా..

గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా? అయితే ఈ నష్టం తప్పదు

For More Latest News

Updated Date - Mar 30 , 2026 | 05:52 PM