కిటికీ గ్రిల్‌లో ఇరుక్కున్న దొంగ.. రాత్రంతా నరకయాతన.. వీడియో వైరల్
ABN , Publish Date - Apr 29 , 2026 | 03:28 PM
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఒక ఆసక్తికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. నిర్మాణంలో ఉన్న ఒక ఇంట్లో చోరీకి ప్రయత్నించిన దొంగ, ఊహించని విధంగా కిటికీ గ్రిల్‌లో ఇరుక్కుపోయి రాత్రంతా నరకయాతన అనుభవించాడు.
ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఒక ఆసక్తికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. నిర్మాణంలో ఉన్న ఒక ఇంట్లో చోరీకి ప్రయత్నించిన దొంగ, ఊహించని విధంగా కిటికీ గ్రిల్‌లో ఇరుక్కుపోయి రాత్రంతా నరకయాతన అనుభవించాడు. నగరంలోని ఒక ప్రాంతంలో నిర్మాణ దశలో ఉన్న ఇంట్లోకి చొరబడిన దొంగ.. గది లోపల ఉన్న ఇనుప కడ్డీలను దొంగిలించడానికి ప్లాన్ చేశాడు. అందుకోసం తలుపులు తీసే క్రమంలో, కిటికీ గ్రిల్ మధ్య నుంచి తన చేతిని లోపలికి పంపాడు. అయితే, అతని చేయి గ్రిల్ మధ్యలో ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా చేయి బయటకు రాకపోవడంతో, ఆ దొంగ రాత్రంతా ఆ కిటికీ వద్దే ఉండిపోయాడు.
ఉదయాన్నే ఇంటి యజమాని వచ్చి చూడగా, కిటికీకి వేలాడుతూ విలవిల్లాడుతున్న దొంగను చూసి షాక్ తిన్నారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు ఇంటి యజమాని. స్థానికులు అక్కడికి చేరుకుని, కిటికీలో చిక్కుకున్న దొంగను చూస్తూ వీడియోలు తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎంతో కష్టపడి ఆ వ్యక్తి చేతిని కిటికీ నుంచి బయటకు తీసి, అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో అతను గతంలో కూడా పలు దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
అనంతపురం మీదుగా తిరుపతికి రైలు
రైలులో మహిళపై దారుణం.. ఏసీ కోచ్‌లోకి తీసుకెళ్లి..
Read Latest Telangana News and National News