Share News

నది మధ్యలో రీల్ కోసం రిస్కీ స్టంట్.. చివరికి..

ABN , Publish Date - Sep 12 , 2026 | 12:27 PM

రీల్ కోసం సరదాగా చేసిన ఓ ప్రయత్నం కాస్తా ప్రాణాల మీదకు తెచ్చింది. అచ్చం సినిమా స్టంట్‌లా కనిపించాలనుకున్న యువకులు.. వేగంగా ప్రవహిస్తున్న సింధు నదిలోకి స్కార్పియోను నడిపించారు. కానీ క్షణాల్లోనే సీన్ మొత్తం మారిపోయింది. వివరాల్లోకి వెళితే..

నది మధ్యలో రీల్ కోసం రిస్కీ స్టంట్.. చివరికి..
Sonamarg Reel Stunt

ఇంటర్నెట్ డెస్క్: జమ్మూ కాశ్మీర్‌లోని సోనామార్గ్‌లో సోషల్ మీడియా రీల్ కోసం కొందరు యువకులు చేసిన ప్రమాదకర సాహసం తీవ్ర కలకలం రేపింది. హోటల్ సింధ్ రిసార్ట్స్ సమీపంలో వేగంగా ప్రవహిస్తున్న సింధు నదిలోకి మహీంద్రా స్కార్పియో వాహనాన్ని నడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీడియో చిత్రీకరణ కోసం డ్రైవర్ వాహనాన్ని నదిలోకి తీసుకెళ్లగా.. కొద్దిసేపటికే బలమైన ప్రవాహంలో స్కార్పియో చిక్కుకుపోయింది. దీంతో వాహనంలోని వారు నది మధ్యలో చిక్కుకుని కొట్టుకుపోయే ప్రమాదం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.


పోలీసులు, స్థానికులు కలిసి వాహనంలోని యువకులను సురక్షితంగా నది ఒడ్డుకు చేర్చారు. అనంతరం స్కార్పియోను కూడా నది నుంచి వెలికితీశారు. డ్రైవర్‌ను శ్రీనగర్‌ నవాకడల్‌కు చెందిన మహ్మద్ ఇబాద్ భట్‌గా, మరో ప్రయాణికుడిని రియాసిలోని మహోర్‌కు చెందిన నసీర్ అహ్మద్ ముగల్‌గా పోలీసులు గుర్తించారు. రీల్ కోసం వాహనాన్ని నదిలోకి నడపడం తీవ్ర నిర్లక్ష్యమని పేర్కొన్న పోలీసులు.. ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గుజరాత్ తీరంలో రెండు వాణిజ్య నౌకలు ఢీ.. రంగంలోకి దిగిన తీర రక్షక దళం

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రూప్-1లో కొత్త సర్వీసులు
For More Weather News And Telugu News

Updated Date - Sep 12 , 2026 | 01:27 PM